అపార్‌ను సరళీకృతం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వం అమలు చేస్తున్న అపార్‌ను సరళీకృతం చేయాలని వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ ట్రెజరర్ రెడ్డిశేఖర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు బుధవారం ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డీఈఓ వరలక్ష్మిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన డీఈఓతో మాట్లాడుతూ అపార్ కసరత్తు వల్ల క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉన్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న టెక్నికల్ సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. అపార్ ప్రక్రియవల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు యువరాజరెడ్డి, కార్యదర్శి జయకాంత్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, బాబు, పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment