చెరకు తోటపై ఏనుగుల దాడి
కల్లూరు(పులిచెర్ల): మండలంలోని వెంకట దాసరపల్లె పంచాయతీలో బుధవారం తెల్లవారు జామున ఏనుగులు పంటలపై దాడి చేశాయి. కొన్ని నెలలుగా మండలంలోనే తిష్ట వేసిన ఈ ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి వరి, చెరకు, అరటి, కూరగాయల పంటలకు భారీగా నష్టం చేకూర్చాయి. విషయం తెలుసుకున్న ఫారెస్టు సిబ్బంది ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన పంటలపై నివేదికను ఉన్నతా అధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్నందున ప్రజలు రాత్రి పూట పొలాల దగ్గరకు వెళ్లకూడదని తెలిపారు.
పోక్సో కేసు నమోదు
పుంగనూరు: పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండుకు చెందిన ఉస్మాన్ ఒక బాలికను తీసుకెళ్లి మోసం చేయడంపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. రాత్రి సీఐ మాట్లాడుతూ బుధవారం ఉస్మాన్‌తోపాటు మరి కొంత మంది బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారని, ఈ విషయమై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment