దేవస్థానం కోసమే గ్రామ కంఠం వినియోగం | - | Sakshi
Sakshi News home page

దేవస్థానం కోసమే గ్రామ కంఠం వినియోగం

Published Wed, Nov 20 2024 12:30 AM | Last Updated on Wed, Nov 20 2024 12:30 AM

దేవస్థానం కోసమే  గ్రామ కంఠం వినియోగం

దేవస్థానం కోసమే గ్రామ కంఠం వినియోగం

కుప్పం: మండలంలోని బొగ్గుపల్లెలో స ర్వే నంబర్‌ 8/2 లోని 31 సెంట్లు గ్రామ కంఠం భూమిని దేవాల యం కోసం వినియోగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం సాక్షి దినపత్రికలో ‘గ్రామ కంఠం అమ్మేశారు!’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గ్రామస్తులందరూ ఏకమై తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత కొన్నేళ్లుగా శ్రీరాముల దేవాలయం నిర్మించాలని గ్రామస్తులు ప్రయత్నాలు చేసినా పనుల జరగలేదన్నారు. గ్రామంలోని గ్రామం కంఠం భూమి అన్యాక్రాంతం కాకుండా దేవాలయం నిర్మాణం కోసం వినియోగిస్తున్నట్లు వారు ఆ వినతిపత్రంలో పేర్కొ న్నారు.

వచ్చే నెల 15 లోపు పంటల బీమా నమోదు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలోని రైతులు డిసెంబర్‌ 15వ తేదీలోపు పంట బీమా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధి కారి మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీ సీజన్‌ దృష్ట్యా ప్రధాన మంత్రి పంటల బీమా యోజన కింద చేపట్టే నేషనల్‌ క్రాప్‌ ఇన్సూరెనన్స్‌ పోర్టల్‌లో భూ రికార్డులు ఆధారంగా రైతులు బీమా నమోదు చేసుకోవచ్చన్నారు. రబీలోని సాధారణ పంటలకు డిసెంబరు 15వ తేదీలోపు, జీడిమామిడి సాగుకు 21వ తేదీలోపు, వరి సాగుకు 31వ తేదీలోపు బీమా చేసుకోవాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

రైతుల వాటా చెల్లింపుపై అవగాహన కల్పించండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని రైతులు సూక్ష్మసేద్యం పరికరాలకు తమ వాటాను చెల్లించేలా అవగాహన కల్పించాలని హార్టికల్చర్‌ అధికారులను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండల స్థాయి హార్టికల్చర్‌ అధికారులు ఈ వారం లోపు 50 హెక్టార్లకు తక్కువ కాకుండా సూక్ష్మసేద్యం అమలుకు రైతుల వాటాను చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 502 ఆర్‌ఎస్‌కేల పరిధిలో 27,723.46 హెక్టార్లకుగాను 27, 980 మంది రైతుల రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు. ఇందులో 10,962.8 హెక్టార్లలో 11,918 మంది రైతులకు సంబంధించి ప్రాథమిక తనిఖీ పూర్తి చేశారన్నారు. 2,860.74 హెక్టార్లకు 3,314 మంది రైతులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 1,287.1 హెక్టార్లలో 1,513 మంది రైతులకు బిందు, తుంపర్ల సేద్య పరికరాలు అందించామన్నారు. ఇంకనూ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులు తమ నాన్‌ సబ్సిడీని జమ చేసేలా మండల స్థాయి అదికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఉద్యానవన , ఏపీఎంఐపీ అధికారులు మధుసూదన్‌రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

రాయితీ యంత్రాలు,పనిముట్లు ఇవ్వాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : రాయితీతో యంత్రాలు, పనిముట్లు అందజేయాలని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్‌ మాజీ సభ్యులు దేవెళ్ల మురళి కోరారు. ఈ మేరకు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు డీఆర్వో మోహన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మురళి మాట్లాడుతూ వడ్డెర జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రాయితీపై పనిముట్లు, యంత్రాలు అందజేయాలన్నారు. యంత్రాల వినియోగం తర్వాత వడ్డెర్లకు ఉపాధి దక్కడం లేదని వాపోయారు. దీంతో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. తాము ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నామన్నారు. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పించాలని కోరారు. ఈఎండీ డిపాజిట్‌ లేకుండా తమకు రిజర్వేషన్‌ ప్రాతిపదికన 50 శాతం పనులను కేటాయించాలన్నారు. వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రవీంద్రరాజు, నాయకులు హరిబాబు, సుబ్రహ్మణ్యం, రుద్రయ్య, కుసుమజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో ఒక కంపా ర్ట్‌మెంట్‌ మాత్రమే నిండింది. సోమవారం అర్ధరాత్రి వరకు 62,085 మంది స్వామివారిని ద ర్శించుకున్నారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భ క్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శ న టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement