ఉచిత గ్యాస్ తుస్సు
● ఉచిత గ్యాస్ పథకం ప్రచారం ఆర్భాటం ● నీరుగారుతున్న పథకం ● గ్యాస్ డబ్బులు అందని వైనం ● బ్యాంకులు, అధికారుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ ● రెండు నెలలుగా ఎదురుచూపులు ● ఆరు నిబంధనలతో అనర్హత వేటు
తెల్లకార్డు ఉంటే చాలు.. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.. ఆడపడుచుల కష్టం తీర్చుతా.. నా మాట నమ్మండి.. ఇదీ ఎన్నికల్లో బాబు హామీ.. అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత గ్యాస్‌కు సిక్స్‌స్టెప్ వెరిఫికేషన్ అమలు పేరుతో గ్యాస్ తుస్సుమనిపించారు. అన్ని అర్హతలుండీ సిలిండర్లు పొందినవారిలోనూ వేలాది మందికి ఎగనామం పెట్టారు. మొత్తంగా చంద్రబాబు మహిళలకు ఉచిత గ్యాస్ పేరిట మరోసారి పొగపెట్టారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉచిత గ్యాస్ తుస్సు అవుతోంది. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం మాట మూన్నాళ్లుముచ్చటగా మారింది. డబ్బులి చ్చి గ్యాస్ కొంటే నగదు రానంటోంది. ఉచిత గ్యాస్ డబ్బులు కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చే యాల్సి వస్తోంది. రెండు నెలలుగా లబ్ధిదారులు న గదు కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభు త్వం తీరుపై మహిళామణులు మండిపడుతున్నా రు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్‌ను ప్రామాణికంగా తీసుకుని ఎన్నికల బరిలో దిగింది. సూపర్‌సిక్స్ అంటూ అన్ని వర్గాల వారిని మభ్యపెట్టింది. ముఖ్యంగా మహిళలకు వంట గ్యాస్ ఇస్తామని మాయ చేసింది కూటమి. ఎన్నికల్లో గెలిచిన తర్వా త ఐదు నెలలలకే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత ఉచిత గ్యాస్ పథకాన్ని హడావుడిగా తెరపైకి తీసుకొచ్చింది. లబ్ధిదారులపై తొ లుత భారం వేసి ఆ తర్వాత నగదు బ్యాంకు ఖాతా కు జమ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గట్టిగా హామీ ఇచ్చింది. అయితే ఈ గ్యాస్ ఉత్తి గ్యాస్ అని మహిళాలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీపా వళి రోజున ప్రకటించిన ఈ ఉచిత గ్యాస్ బండ పేలని టపాసులా మిగిలింది.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
సుమారు 2 లక్షల మంది వరకు నగదు జమ కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంట గ్యాస్ నగదు నిర్ణీత సమయంలోపు పడకపోవడంతో ల బ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్యాస్ నగదు వివరాల కోసం ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. సచివాలయాలకు వెళితే ఈ విషయం తమ కు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు. మండల కార్యాలయాలకు వెళితే ఆ విభాగం చూసే అధికారులే లేరంటున్నారు. అక్కడి నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి సిఫార్సు చేస్తున్నారు. దీంతో అక్కడికి నిత్యం పదుల సంఖ్యలో క్యూ కడుతున్నారు. తమకు డబ్బులు పడలేదని కార్యాలయంలో కంప్యూటర్ సిబ్బందిని చుట్టిముట్టేస్తు న్నారు. లబ్ధిదారులకు సమాధానం చెప్పుకోలేక కార్యాలయ సిబ్బంది గుటకలు మింగుతున్నారు. చివరకు టోల్‌ఫ్రీ నంబర్ చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు.
7 వేల మందిపై అనర్హత వేటు
జిల్లాలో 47 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 6.50 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్‌లున్నాయి. ఇందులో 5.10 గ్యాస్ కనెక్షన్‌లు ఉచిత గ్యాస్‌కు అర్హత సాధించాయి. వీరిలో ఇప్పటి వరకు 2,74,242 మంది ఉచిత గ్యాస్‌కు సిలిండర్లు బుక్ చేసుకుని తీసుకున్నారు. వీరిలో 2,71,156 మందికి రాయితీ నగదు రూ.21.96 కోట్లు మంజూరు కాగా 2,66,860 మందికి సబ్సిడీ నగదు జమ అయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఆ లెక్కల ప్రకా రం నగదు జమ కాలేదు. కాగా సిక్స్‌స్టెప్ వ్యాలువేషన్ పేరుతో జిల్లాలో సుమారు 7 వేల మందిపై అనర్హత వేటు వేసినట్లు తెలిసింది. కాగా గ్యాస్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంకులో జమవుతాయని చెప్పారు. కానీ నవంబర్‌లోపు గ్యాస్ బుక్ చేసుకున్న వారికి 30 రోజులు గడుస్తున్నా వేలాది మంది లబ్ధిదారులకు డబ్బులు జమ కాలేదు.
టోల్‌ఫ్రీ కూడా
ఈకేవైసీ
సాకు..
ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం డబ్బులు బ్యాంకుల్లో పడకపోవడంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అధికారులు వారికి సమాధానం చెప్పలేక కసురుకుంటున్నారు. తమకు సంబంధం లేదని చెబుతున్నారు. దీంతో ఏజెన్సీల వద్దకు వెళితే ఈకేవైసీ చేయించారా? లేదా చూసుకోండనే సమాధానం వినిపిస్తోంది. ఈకేవైసీ చేయించిన వారికి కూడా సబ్సిడీ డబ్బులు పడడం లేదని చెబుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే ఇదంతా వలంటీరు్‌ల్ చూసుకునేవారు. ఎలాంటి సమస్య వచ్చినా వారి దృష్టికి తీసుకెళితే చాలు చిటికెలో పనిచేసి పెట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేక ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు.
ఏ దిక్కు లేని వాళ్లకు చివరకు టోల్ ఫ్రీ నంబరే దిక్కుగా మారుతోంది. అయితే ఉచిత గ్యాస్‌లో సందేహాలుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నంబర్ మూగబోతోంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రయోజనం ఉండడం లేదు. ఈ కారణంగా గ్యాస్ ఏజెన్సీ వద్ద లబ్ధిదారులు క్యూకడుతున్నారు. వారు కూడా ఏ రకమైన సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఉచిత గ్యాస్ పథకం చంద్రబాబు మాయగా ప్రజలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment