లైసెన్స్‌డ్ నర్సరీల్లోనే నారు కొనండి
రొంపిచెర్ల: లైసెన్స్ ఉన్న నర్సరీల్లోనే రైతులు కూరగాయల, పండ్లతోటల నార్లు కొనుగోలు చేయాలని ఉద్యానశాఖ అధికారి సంతోషికుమారి అన్నారు. ఆమె గురువారం మండలంలో టమాట తోటలను పరిశీలించారు. రైతులు చాలా మంది నర్సరీల్లో కొనుగోలు చేసి, నార్లకు రశీదులను తీసుకోవడం లేదన్నారు. ప్రతి రైతు కొనుగోలు చేసి నార్లు, మొక్కలకు సంబంధించి రశీదులు తీసుకోవాలన్నారు. మండలంలో తమ అనుమతి లేనిదే నర్సరీలను ఏర్పాటు చేయకూడదన్నారు. అనుమతి లేని నర్సరీలను నిర్వహిస్తే సీజ్ చేస్తామని చెప్పారు. నర్సరీ యాజమానులు నాణ్యమైన విత్తనాలను నార్లుగా పోయాలన్నారు. నర్సరీలపై ఫిర్యాదులు వస్తే లైసెన్స్‌లను రద్దు చేస్తామన్నారు. సిబ్బంది సుబ్రమణ్యం, నరిసింహులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment