పీబీసీ లైనింగ్‌లో దోపిడీకి స్కెచ్!
● కాకి లెక్కలతో రూ.480.22 కోట్లతో పని అప్పగింత ఉత్తర్వులు ● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన పీబీసీ వెడల్పు పనుల్లో రూ.1,929 కోట్ల నిధులు మిగిలాయట! ● రద్దు చేయకనే అదే కాంట్రాక్ట్ సంస్థకు నామినేషన్‌పై పనులు అప్పగించిన ప్రభుత్వం
బి.కొత్తకోట: ఏవీఆర్ హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగమైన పుంగనూరు ఉప కాలువ లైనింగ్ ప నులను ప్రభుత్వం టెండర్ లేకుండా అప్పనంగా అ ప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి సీఈ పంపిన ప్రతిపాదన నివేదిక మేరకు అ న్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని తంబళ్లపల్లె, మదనప ల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో సాగే పుంగనూరు ఉపకాలువకు 75 కిలోమీటర్ నుంచి 189 కిలోమీటర్ వరకు కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపి, రూ.480.22 కోట్ల పనిని నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకి కట్టబెడుతూ ఉత్తర్వు జారీ చేసింది. అసలు ఈ జీఓ జారీ, పనుల అప్పగింత, నిధుల కేటాయింపు, ఏ పని ఎంత చేయాలి, డిజైన్, పని స్వరూపం తదితర వాటికి సంబంధించి స్పష్టత లేకనే పనులకు అనుమతి ఇవ్వడంపై నీటి పారుదల రంగ నిపుణులు విస్తుపోతున్నారు.
పని చేయకనే నిధుల మిగులా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా పుంగనూరు ఉపకాలువను వెడల్పు చేసి గండికోట రిజర్వాయర్ నుంచి 800 క్యూసెక్కుల కృష్ణా నీటిని అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు తరలించాలని నిర్ణయించింది. ఈ పనులకు రూ.1,929 కోట్లు మంజూరు చేయగా హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ రూ.1,217 కోట్ల కు పనులు దక్కించుకుంది. కొంతమేర పనులు చేయ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 25 శాతంలోపు పనులను రద్దు చేసింది. దీంతో ఈ పని కూడా రద్దు అయ్యింది. అయితే పుంగనూరు ఉపకాలువ లైనింగ్ పనికి రూ.485.10 కోట్లు మంజూరు చే యాలని తిరుపతి సీఈ నివేదిక మేరకు రూ.480.22 కోట్లకు మంజూరు చేస్తున్నట్టు జీఓలో పేర్కొన్నారు. కాగా గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1,929 కోట్లు మిగిలాయని, అందులో రూ.480.22 కోట్లు ఖ ర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. నిధులు ఏ విధంగా మిగిలాయో చెప్పలేదు.
కాంట్రాక్టర్‌కు దోచి పెట్టాలనే..
పీబీసీ వెడల్పు పనులను రద్దు చేసిన ప్రభుత్వం అదే పనిని నిధులు మిగులుగా చూపిస్తూ.. ఈ మిగులు ని ధులతో పుంగనూరు ఉపకాలువ లైనింగ్ పనులు చేపడుతున్నట్టు జీఓలో చెప్పడం చూస్తే అంతా అవినీతి కథలా కనిపిస్తోంది. టెండర్ల నిర్వహణ లేకుండా నా మినేషన్‌పై నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకి కాలువ వె డల్పు పనుల ఒప్పందం మేరకు అంటూ అప్పగించేసింది. ఇష్టమొచ్చినట్టు పనులు చేసుకునేలా, బిల్లులు పెట్టుకునేలా జీఓ ఉందని నిపుణులు అంటున్నారు.
సాక్షి ముందే చెప్పింది
పుంగనూరు ఉప కాలువ పనిని ప్రభుత్వం టెండర్లు లేకుండా నామినేషన్‌పై కట్టబెట్టేలా చూస్తోందని అన్నమయ్య జిల్లా పేజీలో ఈనెల 8వ తేదీన ‘టెండర్లా..నామినేషనా?’ అన్న శీర్షిక కథనం ప్రచురితమైంది. ప్రభుత్వం నామినేషన్‌పై పనులు అప్పగించడంతో సాక్షి కథనం నిజమైంది.
కుప్పం కోసమే పెంపు
పుంగనూరు ఉప కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం 145 క్యూసెక్కులు ఉంటే కుప్పం నియోజకవర్గం కోసం కిలోమీటర్ 189.800 నుంచి కిలోమీటర్ 207.800 వరకు కాలువను వెడల్పు చేస్తారు. ఇక్కడి నుంచి నీటి ప్రవాహ వేగం 282 క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment