లారీ సీజ్
పుంగనూరు: హైదరాబాద్ నుంచి కేరళకు కంటైనర్ లారీలో సుమారు 100 పశువులను తరలిస్తుండగా బుధవారం స్థానిక వ్యాపారులు అడ్డుకుని లారీని పోలీసులకు అప్పగించారు. గోవధ నిషేధం అమలులో ఉన్నా నిత్యం వేలాది పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కంటైనర్‌లో కబేళాలకు తరలుతున్న పశువుల లారీని సీజ్ చేసి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అదృశ్యం
చిత్తూరు అర్బన్: నగరంలోని సిద్ధార్థ్‌నగర్‌కు చెందిన బి.శంకర్ నారాయణ (54) అనే వ్యక్తి కనిపించడంలేదంటూ ఆయన తనయుడు జగదీష్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐదు నెలల క్రితం తలకు చికిత్స చేయించుకున్న తన తండ్రి మానసిక పరిస్థితి బాలేదని.. ఈనెల 22వ తేదీన బయటకు వెళతానని చెప్పి కనిపించకుండా పోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు.
ఆలయ సమీపంలో
వ్యక్తి మృతదేహం
పుత్తూరు: పట్టణంలోని ధర్మరాజులస్వామి ఆలయ సమీపంలో బుధవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నారాయణవనం మండలం అరణ్యంకండ్రిగ పంచాయతీ బొమ్మనేటి ఇండ్లు గ్రామానికి చెందిన గోపి(46)గా గుర్తించారు. మృతుడు పుత్తూరు పరిసరాల్లో తాపీమేసీ్త్రగా పనిచేస్తూ, బస్టాండ్, ఆలయాల వద్ద నిద్రింస్తుంటాడు. అవివాహితుడు అయిన ఇతడికి సోదరి తిరుపతిలో నివసిస్తోంది. అతడి సోదరికి సమాచారం అందించి, మృతదేహాన్ని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment