ఇదీ.. ఎస్టీపీ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఇదీ.. ఎస్టీపీ లక్ష్యం

Published Thu, Dec 26 2024 1:42 AM | Last Updated on Thu, Dec 26 2024 1:42 AM

-

పలమనేరు మున్సిపాలిటీలో సుమారు లక్ష జనాభా ఉంది. ఇక్కడి నివాసాల నుంచి వచ్చే డ్రైనేజీ మొత్తం పట్టణానికి పడమట వైపునున్న పెద్దచెరువులోకి చేరుతోంది. ఈ సమస్య దశాబ్ధాలుగా పట్టణానికి ఇబ్బందిగా మారింది. వ్యర్థాల కారణంగా పెద్ద చెరువులో దుర్వాసన వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రాధా బంగ్లా ప్రాంతంలో చెరువు కట్టకింద సీవరీజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎస్టీపీ) నిర్మాణం కోసం 3.70 ఎకరాల భూసేకరణ చేసేందుకు ఇటీవల స్థలాలను అధికారులు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణతో కలిపి రూ.21 కోట్లు అంచనా వేశారు. దీంతో పట్టణంలోని 7.8 ఎంఎల్‌డీ మరుగునీరు పెద్ద చెరువులోకి వెళ్లకుండా ఎీస్టీపీలో శుభ్రం చేసి, ఆ నీటిని ఈ ప్రాంతంలోని రైతులకు అందించేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు పక్కనే 13 సెంట్లలో ఎన్‌ఎస్‌డీపీని సైతం నిర్మిస్తామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే పట్టణంలోని పెద్దచెరువు కాలుష్య సమస్య పరిష్కారమవుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement