దర్జాగా కబ్జా
వి.కోట: అధికార పార్టీ అండదండలతో బండ పొరంబోకు భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారుల పట్టించుకోకుండా నిర్లక్ష్యధోరణిగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళి తే.. వి.కోట మండలంలోని వి.కోట పేర్నంబట్ జాతీయ రహదారి సుద్దులకుప్పం సబ్‌స్టేషన్ ఎదురుగా అదే గ్రామానికి చెందిన పలువురు ఎస్సీ, బీసీ కుంటుంబాలకు చెందిన దరఖాస్తు భూములున్నాయి. వాటి పక్కనే దెయ్యాల బండ సుమారు 5 ఎకరాలకు పైగా ఉంది. బండకు చుట్టుపక్కల ఉన్న పలువురు దళితుల భూములను ముదరందొడ్డి పంచాయతీ సర్పంచ్, వారి బంధువులు కొనుగోలు చేశారు. అలాగే బండ జోలికి ఎవరూ రాకుడదంటూ దళితులను బెదిరించడం ప్రారంభించారు. ప్రస్తుతం బండపై కొంత భాగం వరకు మట్టి తోలి బండను పూడ్చేశారు. దాదాపు ఎకరం వరకు బండపై పామ్‌హౌస్ నిర్మిస్తున్నా రని చుట్టు పక్కల గ్రామస్తులు తెలిపారు. అంతేకాక బండకు చుట్టూ ప్రహరీ నిర్మించి, పది రోజులుగా ఫామ్‌హౌస్ పనులు చేపడుతున్నారు. అధికార పార్టీ అండదండలతో వారు బండ పొరంబోకు భూమిని ఆక్రమించి, నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు తమకేమీ తెలీయనట్టు వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధే బండ పోరంభోకు భూమిని కబ్జా చేయడం ఏమిటని ప్రజలు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు దీనిపై స్పందించి, చర్యలు తీసుకుని బండ భూమిని కాపాడాలని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment