క్రీస్తు సందేశం.. శాంతి మార్గం
నగరి: క్రీస్తుసందేశం శాంతి మార్గమని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. మున్సిపాలిటీలోని నెత్తం కండ్రిగలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేశా రు. ఆమె మాట్లాడుతూ క్రీస్తుమార్గం అనుసరణీయమని అన్నారు. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణ ప్రేమపూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ యేసు బోధనలను ఆద రించి ధర్మం, విశ్వాసపూరిత గమనానికి యేసుక్రీస్తు జీవనం అందరికీ ప్రేరణనిస్తుందన్నారు. మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం ఉన్నారు.
పోలీసుల అదుపులో
గంజాయి ముఠా
చిత్తూరు అర్బన్: నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం చామంతిపురం పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు గంజాయి వి క్రయిస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, గంజాయి విక్రయిస్తున్న పలువురు నిందితుల ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి ఎక్క డి నుంచి వచ్చిందనే విషయమై నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
చిత్తూరులో నవ వరుడు ఆత్మహత్య
చిత్తూరు అర్బన్: వివాహమై నాలుగు నెలలు కూడా నిండకముందే ఓ నవవరుడు చిత్తూరు లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. వన్‌టౌన్ సీఐ జయరామయ్య కథనం మేరకు.. కుక్కలపల్లెకు చెందిన వినోద్‌కుమార్ (32) వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఇతడికి వివాహం జరిగింది. భార్యతో కలిసి చిత్తూరు కయినికట్టువీధిలో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఇంటి పైకప్పుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి గత కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment