ప్రత్యేక అవసరాల గల పిల్లలపై దృష్టి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా లోని భవిత కేంద్రాలు, పా ఠశాలల్లో చదువుతున్న ప్ర త్యేక అవసరాల గల పిల్ల లపై ప్రత్యేక దృష్టి సారించాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన ఏపీసీ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ప్రభుత్వం తరఫున అలెవెన్సులు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క విద్యార్థికి రవాణా భత్యం రూ.3 వేలు, ఎస్కార్ట్ అలవెన్స్ రూ.3 వేలు, హోం బేస్డ్ ఎడ్యుకేషన్ రూ. 2 వేలు, బాలికలకు స్టైఫండ్ రూ.2 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపుల్లో అర్హత పొందే ప్రత్యేక అవసరాల పిల్లలకు కృత్రిమ అవయవాలు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఐఈ కోఆర్డినేటర్ జయప్రకాష్‌నాయుడు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి విద్యార్థికి సీడబ్ల్యూఎస్‌ఎన్, సదరం, యూడీఐడీ కార్డు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రహణమొర్రి ఆపరేషన్లకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ఐఈ నరసింహ, ఐఈ అసిస్టెంట్ మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment