జనంపై రూ.15 వేల కోట్లు భారం
ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని పల్లెపల్లెకు తిరిగి చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పారు. అధికార పీఠంపై కూర్చున్న ఆరునెలల్లోనే రెండుసార్లు జనంపై సర్దుబాటు పేరుతో సుమారు రూ.15 వేల కోట్ల భారం మోపారు. అమరావతి పరిసర ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేసి, రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. అమరావతికి మాత్రమే రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రం అంటే అమరావతిలోని ఐదు గ్రామాలే కాదు..రాష్ట్రమంతా అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలి. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ప్రజలు గళం విప్పకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాల పన్నులు వేసి, పీల్చిపిప్పి చేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.
– ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment