ఎన్నికల సమయంలో పవర్‌ల్యూమ్స్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు నెరవేర్చాలి. నగరి నియోజకవర్గంలో అత్యధికంగా పవర్‌ల్యూమ్స్ కార్మికులు ఉన్నారని, వారి కోసం 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పుత్తూరుకు వచ్చిన చంద్రబాబు, లోకేష్ నమ్మ బలికి, నేడు మోసం చేయడం ఎంత వరకు సబబు కాదు. అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగరికి వచ్చినప్పుడు పవర్‌ల్యూమ్స్ కార్మికుల కోసం 94 పైసల ట్రూఆప్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అమలు చేశారు. తప్పుడు హామీలిచ్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు పవర్‌ల్యూమ్స్ కార్మికులను నిలువునా మోసం చేశారు. ఆరు నెలల్లోనే రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. ప్రజలపై ఇంతటి భారం మోపడం సరికాదని పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. ఆయనకు డిప్యూటీ సీఎంగా పదవి ఇచ్చినందుకు మాట్లాడడం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి.
– మాజీ మంత్రి ఆర్కే రోజా
Comments
Please login to add a commentAdd a comment