కాణిపాకం: కాణిపాకంలోని పలు టెండర్ డిపాజిట్‌లో జాప్యం చోటుచేసుకుంటోంది. అధికారం అండతో పలువురు టెండర్‌దారులు డిపాజిట్ నగదు చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఐదుగురు రూ. కోటి వరకు డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. దీనిపై ఉభయదారులు, భక్తులు, ఓ వర్గం కూటమినేతలు మండిపడుతున్నారు. వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని పలు షాపులు, ఆలయ పరిసర ప్రాంతాల్లో పలు పనుల నిర్వహణకు సంబంధించి పలుసార్లు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను కూటమి నేతలకే దక్కేలా విశ్వ ప్రయత్నాలు జరిగాయి. టెండర్లే వేయకుండా కుట్రలు పన్నారు. ఈ ప్రయత్నంలో టెండర్ల ప్రక్రియ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. టెండర్ల వ్యవహరంపై పలు వార్తా పత్రికల్లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు గతనెల టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. టెండర్లు పాడుకున్న వ్యక్తులు ఒప్పందం మేరకు డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాతే లైసెన్స్‌లు అప్పగిస్తారు. అయితే కొందరు (ఐదుగురు) కూటమి సర్కారును అడ్డం పెట్టుకుని.. డిపాజిట్ నగదు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. అయినా లెసెన్స్‌లు మాత్రం జారీ చేశారు. ఈ నేపథ్యంలో డబ్బులు చెల్లించకుండా ఎలా లైసెన్స్‌లు జారీ చేస్తారని ఉభయదారులు, భక్తులు, కూటమి నేతలు పలువురు మండిపడుతున్నారు. ఐదుగురికిగాను రూ. కోటి వరకు డిపాజిట్ బకాయిలు ఎలా పెడుతారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై కూటమిలోని ఓ వర్గం దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌కు ఫిర్యాదు చేయనుంది. కాగా అధికారులు వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment