భక్తులతో కిక్కిరిసిన బోయకొండ | - | Sakshi
Sakshi News home page

భక్తులతో కిక్కిరిసిన బోయకొండ

Published Mon, Jan 6 2025 8:20 AM | Last Updated on Mon, Jan 6 2025 8:20 AM

భక్తు

భక్తులతో కిక్కిరిసిన బోయకొండ

చౌడేపల్లె: జిల్లాలోని పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా ముస్తాబుచేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు, జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీతో పెరగడంతో క్యూలన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భక్తులతో కిక్కిరిసిన బోయకొండ1
1/1

భక్తులతో కిక్కిరిసిన బోయకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement