ఎన్‌ఎస్‌ఎఫ్ చాంపియన్ షిప్ పోటీలు
నాయుడుపేటటౌన్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నాయుడుపేట స్పోర్ట్స్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్)వారి సారథ్యంలో ఆదివారం సాయంత్రం వరకు 7వ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్ వ్యవస్థాపకులు, జాతీయ పారా అథ్లెటిక్ మోమిడి లక్ష్మయ్య, కమిటీ సభ్యుల సారథ్యంలో 6, 8, 10, 12, 14 ఏళ్ల పిల్లలకు 60, 80, 100, 200, 400, 600 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ముందుగా ఈ పోటీలను జుడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగూరయ్య, బట్టా సుబ్రహ్మణ్యం యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయకులు నెలవల రాజేష్, ఉయ్యాల ప్రవీణ్‌కుమార్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఐదు వరుస విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులతో పాటు మెడల్స్, సర్టిఫికెట్లు, స్పోర్ట్ టీషర్టులను అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ మునిరత్నం, ఆర్యవైశ్య సంఘ తిరుపతి జిల్లా రూరల్ అధ్యక్షుడు గూడూరు కిషోర్ కుమార్, ఎన్‌ఎస్‌ఎఫ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పోటీల్లో పాల్గొన్న 600 మందికి పైగా ఆంధ్ర, తెలంగాణ క్రీడాకారులు
Comments
Please login to add a commentAdd a comment