హంద్రీనీవా కాలువలో ఇక నీరు రానట్టే?
● నికర జలాలను ఏపీ, తెలంగాణలు వాడుకున్నాకే ఇక్కడికట! ● బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తేల్చి చెప్పిన కూటమి సర్కార్ ● నికరజలాలు పోతే మిగులు జలాలు కుప్పానికి రానట్టే ● అందుకే పీబీసీ, కేబీసీ కాలువ లైనింగ్ పనులకు ప్రాధాన్యం
సీమ కరువుకు చిరునామా.. అలాంటి రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న సదుద్దేశంతో హంద్రీనీవా ప్రాజెక్టు చేపట్టారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా పడమటి మండలాలకు సాగు, తాగు నీరందించాలని పుంగనూరు ఉపకాలువ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కెనాల్ విస్తరణ పనులు సైతం మొదలు పెట్టారు. అయితే కూటమి నిఖర జలాలు మిగిలితేనే ఉపకెనాల్‌కు నీరని మెళిక పెట్టింది. ఫలితంగా కర్షకుడికి క‘న్నీరే’ మిగలనుంది.
పలమనేరు: జిల్లాలోని పడమటి ప్రాంతాలకు సా గు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టు చేపట్టింది. అయితే ఈ కాలువలో కృష్ణా జలాలు భవిష్యత్తులో రానట్టేనని తె లుస్తోంది. కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్–1 తీ ర్పు అమల్లో ఉన్నంత కాలం కృష్ణాలోని 811 టీఎంసీల నికరజలాలను ఏపీ, తెలంగాణాలు వాడుకుని, ఆపై మిగులు జలాలు మాత్రమే హంద్రీనీవా కా లువకు విడుదల చేస్తామని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. దీ న్ని బట్టి చూస్తే భవిష్యత్తులో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవాకు నీరు వచ్చే అవకాశం లేదని తెలిసిపోయింది. ప్రధాన కాలువకే నీరు రాకుంటే ఇందులో అంతర్భాగమైన పుంగనూరు, కుప్పం ఉపకాలువలు అలంకార ప్రాయంగా మారడం ఖాయం.
నీరు రాకున్నా లైనింగ్ పనులకు పచ్చజెండా
హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచి కెనాల్ విస్తరణ కో సం గత ప్రభుత్వం రూ.1219.93 కోట్లతో చేపట్టిన పనులకు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. అయితే పీబీసీ కాంక్రీట్ లైనింగ్ పనులకోసం రూ.480.22 కోట్లకు ప్రభుత్వ అనుమతులునిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేశారు. ఈ లైనింగ్ పనుల ద్వారా పీబీసీ ప్రవాహ సామర్థ్యాన్ని 145 నుంచి 282 క్యూసెక్కులకు పెంచే లక్ష్యంగా పేర్కొన్నారు. క్రిష్ణా ట్రిబునల్ ఆదేశాలు మిగులు జలాలు మాత్రమేనని స్పష్టం చేశాక కూడా నీరు రాని కాలువలో నీటి సామర్థ్యాన్ని ఎలా పెంచుతా రో కూటమి ప్రభుత్వానికే తెలియాలి. ఇప్పటికే కు ప్పం బ్రాంచి కెనాల్‌కు సైతం లైనింగ్ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.161.78 కోట్లతో టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందంతా చూస్తే కాలువలో నీరు రాకున్నా పర్వాలేదు గానీ, లైనింగ్ పనులతో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు సిద్ధమైందని అర్థమవుతోంది.
పుంగనూరు కాలువ స్వరూపమిదీ
హంద్రీనీవా ప్రధాన కాలువ కర్నూలు జిల్లా మల్యాల నుంచి ప్రారంభమై 554కి.మీ. ప్రయాణించి అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని అడవిపల్లి రిజర్వాయర్ వద్ద ముగుస్తుంది. ఈ ప్రధాన కాలువలోని 400 కి.మీ వద్ద అనంతపురం జిల్లాలో బొంతలపల్లి వద్ద ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించడంతో పుంగనూరు ఉపకాలువ మొదలవుతుంది. అక్కడి నుంచి తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాల మీదుగా పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలంలోని పశపత్తూరులో 224 కి.మీ. వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి కుప్పం ఉపకాలువ మొదలవుతుంది.
పూర్తిగా నిండిన చెర్లోపల్లి రిజర్వాయర్ నీరు వృథా
వర్షాల కారణంగా సత్యసాయి జిల్లాలోని చెర్లోపల్లి జలాశయం 1.5 టీఎంసీల నీటితో నిండుకుండను తలపిస్తోంది. ఇదే సమయంలో పుంగనూరు, పలమనేరు కుప్పం నియోజకవర్గాల్లో 90 శాతం చెరువులకు చుక్కనీరు లేదు. ఇప్పుడు చేస్తున్న లైనింగ్ పనులను కొంత సమయం ఆపి, జలాశయం నుంచి నీటిని పుంగనూరు ఉపకాలువ నుంచి కుప్పం ఉపకాలువకు కృష్ణా జలాల విడుదల చేసుంటే ఈ ప్రాంతాల్లోని చెరువులు నిండి పంటపొలాలకు సాగునీటి ఇబ్బందులు తప్పేవి. ఇక్కడి చెరువులు నిండాక లైనింగ్ పనులు చేపట్టినా ఇక్కడి రైతులకు వచ్చే నష్టమేమి లేకుండా ఉండేది. కాని కూటమి ప్రభుత్వం చెర్లోపల్లి నుంచి నీటిని విడుదలకు చిత్తశుద్ధి చూపకుండా కేవలం కాంట్రాక్టర్ల కోసం అటు పుంగనూరు, ఇటు కుప్పం బ్రాంచి కెనాళ్ల లైనింగ్ పనులకు పూనుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment