సీఎం పర్యటనకుపకడ్బందీగా ఏర్పాట్లు
కుప్పం: సీఎం చంద్రబాబు రెండురోజుల కు ప్పం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చే యాలని అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి ఆయన పరిశీలించారు. ద్రవిడ వర్సిటీ కందుకూరి వీరేశలింగం ఆడిటోరియంలో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూఈ నెల 6, 7వ తేదీల్లో ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా సీఎం పర్యటన ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. తరువాత ద్రవిడ వర్సిటీ ప్రాంగణంలో హెలీప్యాడ్, అగరం కొత్తపల్లెలో ప్రజలతో ముఖాముఖి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం కుప్పంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహించే పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మరమ్మత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని మురకంబట్టులో ఉన్న ఎస్‌జీఎం కల్యాణ మండపంలో ఈ నెల 4 వ తేదీన లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు జాతీయ అంధుల సమాక్య జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ అంధుల సమా క్య ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు. అంధులు మంచి విద్యనభ్యసించి జీవితంలో విజయాలను సాధించేందుకు వీలు కల్పించిన పద్ధతి బ్రెయిలీ లిపి అని అన్నారు. బ్రెయిలీ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 4 వ తేదీన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న బ్రెయిలీ జయంతి దినోత్సవానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఢిల్లీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు మూడు నెలల ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన కోసం మూడు నెలల పా టు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఈడీ హరినాథరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయీమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజెస్ డెవలప్‌మెంట్) ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఈ శిక్షణను ఆసక్తి ఉన్న మై నారిటీ (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైను లు, బౌద్ధులు, జొరాస్ట్రియన్) సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న వారు వృత్తి, విద్య, ఇతర విద్యార్హతల సర్టిఫికెట్‌ల జిరా క్సులతో బయోడేటాను ఈ నెల 17వ తేదీ లో పు కలెక్టరేట్‌లోని మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
టీబీ పరీక్షలు విధిగా చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నిరంతరంగా దగ్దు వస్తున్న వ్యక్తులకు విధిగా టీబీ పరీక్షలు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆమె శుక్రవారం ల్యాబ్ టెక్నిషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు ఉన్న వ్యక్తులకు టీబీ పరీక్షలు చేయాలన్నారు. అనుమానిత కేసు లకు ఆశ కార్యకర్తలు గళ్ల పరీక్షలు చేసి, వివరాలు అందించేలా చూడాలన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయినవారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీబీ నివారణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, అధికారులు అనిల్‌కుమార్, రామచంద్రారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment