చిత్తూరురూరల్(కాణిపాకం): ఎన్‌సీడీ స్క్రీనింగ్ సర్వే ను పకడ్బందీగా చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి అన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాయలంలో ఆమె శుక్రవారం అధికారులతో మాట్లాడారు. ఎన్‌సీడీ సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని కచ్చితంగా సర్వే చేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన వ్యక్తులను పరీక్షించాలన్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సర్వేలో గుర్తించిన విషయాలను అధికారులకు వివరాలు అందేలా చూసుకోవాలన్నారు. బాధితులను గుర్తిసే తగిన సలహాలు అందించి, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు అందేలా చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment