దేశ చరిత్ర తిరగరాసిన ఏకై క సీఎం జగన్
–మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
కార్వేటినగరం: తెలుగుభాషతోపాటు పేదలకు ఆంగ్ల మాద్యమం అందుబాటులోకి తీసుకొచ్చి దేశచరిత్రను తిరగరాసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బడు గు, బలహీన వర్గాలకు అందని ద్రాక్షలా ఉన్న ఆంగ్లమాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి, బైజ్యూస్ కంటైంట్‌తోపాటు ట్యాబ్‌లను అందించిన ఘనత కూడా మాజీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగును నిర్వీర్యం చేశారని ప్రము ఖులు విజయవాడలో జరిగిన తెలుగు మహాసభల్లో చెప్పడం దారుణమన్నారు. దళితులకు ఆంగ్లభాషను అందించడం నేరమన్నదే దానికి అర్థమన్నారు. విద్యావంతులు కూడా దళితులు, ని రుపేదల ఉన్నతిని జీర్ణించుకోలేక, కుల వివక్ష చూపుతున్నారని నారాయణస్వామి విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రభు త్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చారని, అలాగే విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందించారన్నారు. పేద విద్యార్థులకు మేనమామగా నిలిచారని, ఆ విషయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు దాసోహమై, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని పేర్కొన్నారు. పలువురు ప్ర ముఖుల మనవళ్లు మాత్రం కార్పొరేట్ స్థాయిలో విద్యనభ్యసించాలి, బడుగు బలహీన వర్గాల పి ల్లలు మాత్రం నాణ్యత లేని విద్యకే పరిమితం కావాలా..? అన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ నా ణ్యమైన విద్య అందించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మాజీ సీఎంజగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. రాక్షస పాలన సాగిస్తూ దళిత, పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment