గుంతలు పడిన చిత్తూరు – తిరుత్తణి రోడ్డు
నాసి రకం రోడ్ల పనులు చేసి, రూ.కోట్లలో బిల్లులు స్వాహా
గుంతలు పూడ్చుతున్నామంటూ కూటమి ప్రభుత్వం ఆర్భాటం
జిల్లాలో 280కి పైగా రోడ్లలో అలాగే దర్శనమిస్తున్న గుంతలు
దుమ్మెత్తి పోస్తున్న జిల్లా ప్రజలు
మరమ్మతులు చేసినట్లుండాలి.. కానీ చేయకూడదు.. తారు కలిపామా? లేదా అన్నట్లుండాలి. ౖపైపె పూత పూ యాలి కానీ నాణ్యతగా మరమ్మతులు చేయకూడదు. బిల్లు మంజూరు అయ్యేవరకు ఉంటే చాలు.. ఇదీ కూటమి నేతలు, కాంట్రాక్టర్ల వ్యూహం. నాగరితకు చిహ్నం అయిన రహదారుల మరమ్మతుల్లో నాణ్యత నలిగిపోగా.. కూటమి నేతలు, కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఓ వైపు రోడ్లపై గుంతలు పూడ్చుతుండగా మరో వైపు మళ్లీ గుంతలు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో రోడ్లు మరమ్మతు లు చేపట్టారు. ఆ పనుల్లో నాణ్యత లేకపోవడంతో మరమ్మతులు చేసిన రెండు రోజులకే మళ్లీ అధ్వానంగా మారాయి. దీంతో వాహనచోదకులు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాల్లోని ఆర్‌అండ్‌బీ రోడ్లు మరమ్మతు చేసిన రెండు రోజులకే మళ్లీ గుంతలు పడ్డాయి. దీంతో ఆర్‌అండ్‌బీ పరిధిలో 280 పైగా రోడ్లల్లో గుంతలు అలాగే దర్శనమిస్తున్నాయి.
సంక్రాంతిలోపు మరమ్మతులు పూర్తి ప్రశ్నార్థకమే
జిల్లాలో బీటీ రోడ్ల మరమ్మతులు, గుంతలు పూడ్చే కసరత్తు సంక్రాంతిలోపు పూర్తయ్యే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. జిల్లాలో 280 రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు ప్రభుత్వం రూ.21.53 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 1500 కిలోమీటర్లు పొడవున ఉన్న ఈ రోడ్ల మరమ్మతుల కాంట్రాక్టులను అధికార పార్టీ నేతలు సిఫార్సులు ఉన్నవారికే కట్టబెట్టారు. అయితే వీటిని సంక్రాంతికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఇప్పటి దాదాపు 50 శాతం పనులు సైతం పూర్తి కాని పరిస్థితి. అంటే 130 రోడ్లలో పనులు 700 కిలోమీటర్లు మాత్రం పూడ్చారు. అవి కూడా నాసిరకంగానే పనులు చేపట్టడంతో కొన్నాళ్లకే మళ్లీ గుంతలుగా దర్శనమిస్తున్నాయి. మిగిలిన రోడ్ల ప నులను సంక్రాంతిలోపు పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరడం అనుమానంగానే ఉందని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఇందులో నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే కుప్పం 437 కిలోమీటర్లు, పూతలపట్టు 95 కి.మీ, పలమనేరు 105, పుంగనూరు 40, చిత్తూరు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాలు కలిపి 20 కిలోమీటర్లు చొప్పున మొత్తం 700 కిలోమీటర్లు మాత్రమే రోడ్డు వేశారు. మిగిలిన రోడ్లన్నీ అలాగే ఉన్నాయి.
చిత్తూరు 13 2.86
పూతలపట్టు 46 3.18
జీడీనెల్లూరు 37 4.08
నగరి 22 2.88
పలమనేరు 43 2.05
పుంగనూరు 34 2.65
కుప్పం 85 3.83
మొత్తం 280 21.53
Comments
Please login to add a commentAdd a comment