బాబు బడాయి
కుప్పానికి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబునాయుడు అవే హామీలు.. అవే మాటలతో గారడీ చేస్తున్నారు. దాదాపు 35 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నా ఆయన తన నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధిని చేయలేకపోయారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేసినా కుప్పానికి కనీసం తాగు, సాగునీరు కూడా ఇవ్వలేక పోయారు. గతంలో విమానాశ్రయ మంటూ ఊదరగొట్టారు. ఇజ్రాయిల్ వ్యవసాయమని నమ్మించి వంచించారు. ఇప్పుడు విమానాల రిపేర్లు చేసే పరిశ్రమ వస్తుందని, సేంద్రియ వ్యవసాయాన్ని తీసుకొస్తా మని వరాల వాన కురిపించారు. ఆయన బురిడీ మాటలు నమ్మలేమని కుప్పం ప్రజలు చర్చించుకుంటున్నారు.
● 2020 నుంచి 2047కు వెళ్లిన చంద్రన్న విజన్ ● 1995 నుంచి అవే మాటలు.. అవే హామీలు ● నాడు హంద్రీ నీరు అన్నారు.. నేడు గోదావరి అంటున్నారు ● కుప్పం విమానాశ్రయం శంకుస్థాపనకే పరిమితం ● ఇజ్రాయిల్ సేద్యం పాయె... ఆర్గానిక్ సేద్యం వచ్చే ● కుప్పానికి 35 ఏళ్లుగా అవే వరాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు విజనరీ విని కుప్పం ప్రజలు నవ్వుకుంటున్నారు. ఓట్ల కోసమే తప్ప కుప్పం అభివృద్ధిని ఆయన ఎప్పుడూ కాక్షించలేదని పలువురు చర్చించుకుంటున్నారు. 1995 సెప్టెంబర్ 1న మొదటి సారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విజన్ 2020 తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రాన్నే కాకుండా కుప్పా న్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామంటూ నమ్మబలికారు. 2020 అయితే పూర్తయింది కానీ చంద్రబాబు హామీలు మాత్రం అమలుకు నోచుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.
పరిశ్రమలెక్కడ బాబూ?
కుప్పం నుంచి ఎన్నికై న చంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు మొట్టమొదటి హామీ పరిశ్రమలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తానని గొప్పగా ప్రకటించారు. జనం కూ డా ఆయన మాటలను నమ్మారు. అయితే ఇప్పటికీ చెప్పుకోదగ్గ పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. చిన్న తరహా ఆర్‌బీఏ, షాహీ పరిశ్రమలను తీసుకొచ్చారు. వాటిల్లో మొత్తం కలిపితే 2వేల మంది పనిచేస్తుంటారు. అందులోనూ స్థానికేతరులే అధికం. కొన్ని పరిశ్రమలు ఎంఓఈలు చేసుకుని, స్థలాలు కేటాయించినా కార్యరూపం దాల్చలేకపోయాయి. తాజాగా మంగళవారం మరో రెండు చిన్న తరహా పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఫలితంగా ఉపాధి కోసం కుప్పం ప్రజలు కర్ణాటక, తమిళనాడు బాట పడుతున్నారు. నిత్యం సుమారు పది వేల మందికి పైగా స్థానికులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు.
హామీల కుప్పం
కుప్పం నియోజకవర్గంలో మండలానికో పరిశ్రమ ఏర్పాటు
వంద శాతం సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం. నెలకు రూ.30వేల నుంచి రూ.40 వేలు ప్రతి రైతుకూ ఆదాయం.
ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయడం
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు
బెంగళూరుకు మించి అభివృద్ధి
బెంగళూరు పిల్లలు కుప్పంలో చదువు, ఉద్యోగం చేసుకునే విధానం తీసుకురావడం
ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్
దేశానికే కుప్పాన్ని ఆదర్శం చేయడం
రెండున్నరేళ్లల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ అందమైన రోడ్లు
విమానం పాయె..
రిపేర్లుకొచ్చే!
ఇజ్రాయిల్ పోయింది..ఆర్గానిక్ తెస్తారంట
1999లో రెండోసారి ముఖ్యమంత్రిగా కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఇజ్రాయిల్ వ్య వస్థ ద్వారా బిందు, తుంపర్ల సేద్యం తీసుకొ చ్చారు. ఈ సేద్యంలో మొదట్లోన్నే అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడంతో త్రీకే ఆర్ వరకు వచ్చి ఆగిపోయింది. ప్రస్తుత పర్యటనలో పూర్తి స్థాయిలో ఆర్గానిక్ వ్యవసాయం (సేంద్రియ వ్యవసాయం) అంటున్నారు. ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో అని రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఈ పథకాల్లో మెజార్టీ శాతం టీడీపీ నాయకులకే లబ్ధి జరుగుతుండడంతో సాధారణ రైతులు పెదవి విరుస్తున్నారు.
మూడవ మారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి కుప్పం పర్యటనకు వచ్చిన సందర్భంగా కుప్పంలో విమానాశ్రయం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. పదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పునాది రాయి పడలేదు. దీంతో విమానాశ్రయం కూడా వస్తుందా... రాదా? అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. సోమ, మంగళవారాల్లో కుప్పం పర్యటనల్లో విమానాశ్రయాల రిపేర్ల వ్యవస్థను కుప్పానికి తీసుకొస్తానని చెప్పడం గమనార్హం.
గోదావారి నీరు తెస్తారంట?
కుప్పం నియోజకవర్గంలో తాగు, సాగునీటికి ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల అవసరాలను ఓట్లుగా మలచుకునేందుకు చంద్రబాబు తన ప్రతి పర్యటనలోనూ ఆ నది నీరు తెస్తా... ఈ నది నీళ్లు ఇస్తా..? అంటూ మాటలకే పరిమితమవుతున్నారు. ఇప్పటికీ కుప్పం నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటికి ఆకాశం వైపు చూడాల్సి వస్తోంది. తాజాగా గోదావరి నీరు తీసుకొస్తానని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment