ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ టారిఫ్ పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రా రంభమైంది. మంగళవారం ఎస్‌ఈ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏఓ, ఈఈలు హాజరయ్యారు. విజయవాడ నుంచి ఏపీఈఆర్సీ ఇన్‌చార్జ్ చైర్మన్ రాంసింగ్ ఇతర అధికారులు మాట్లాడారు. విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, నష్టాలు భర్తీ కోసం చార్జీలు పెంపు అవసరమని ఉన్నతాధికారులు తెలిపారు. పలు రంగాలకు సబ్సిడీ రూపంలో విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే పెరిగిన బొగ్గు భారం, జీతభత్యాలు, పరికరాల ఖరీదు తదితర అంశాల కారణంగా పెంపు అవసరమన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత తరువాత నిర్ణయం తెలియజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ ప్రసన్న ఆంజనేయులు, ఈఈలు మునిచంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
18న నవోదయ ప్రవేశ పరీక్ష
– డీఈఓ వరలక్ష్మి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 26 పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీన నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2025–26 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయాల ప్రవేశ పరీ క్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు www.navodaya.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్, అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సంబంధిత పరీక్ష కేంద్రాల్లో 18న ఉదయం 10.45 నుంచి 11.30 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారన్నారు. 11.30 గంటల తర్వాత అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్ష 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు నిర్వహిస్తారన్నారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా స మస్యలున్నట్లయితే విద్యార్థులు హెల్ప్‌లైన్ 8919956395, 9491832148 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment