విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
– చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
పుంగనూరు: మండలంలోని ఏడూరు పాఠశాలలో పనిచేసే టీచర్ గణేష్, ఐదో తరగతి చదువుతున్న బా లికను చితకబాదిన సంఘటన సోమవారం జరిగింది. మంగళవారం ఈ మేరకు బాలిక తండ్రి సుధాకర్ ఎంఈఓ రెడ్డెన్నశెట్టికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలి క తండ్రి కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఓ బాలి క స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. రోజులాగే ఆమె సో మవారం స్కూలుకు వెళ్లింది. టీచర్ గణేష్ అకారణంగా బాలిక చెవి, చెంపలపైన కొట్టి గాయపరిచాడు. రాత్రి బాలికకు తీవ్రమైన జ్వరం, చెవి నొప్పి వచ్చింది. ఏమి జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆమె విషయం తెలిపింది. దీంతో వారు బాలికను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఉపాధ్యా యుడి పై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని తల్లిదండ్రులు, ప్రజలు తెలిపారు. ఎంఈఓ మాట్లాడుతూ దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment