పుంగనూరు: సారా, కర్ణాటక మద్యం అక్రమ విక్రయం కేసుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పుంగనూరు మండలంలోని బోడేవారిపల్లె క్రాస్ వద్ద సారా విక్రయిస్తున్న వెంకటేష్‌ను పట్టుకుని అతని వద్ద నుంచి 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు. అలాగే చౌడేపల్లె మండలం మిట్టూ రు బస్టాప్ వద్ద విక్రయించేందుకు ఉంచిన కర్ణాటక విస్కీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సుకన్య అనే మహిళను అరెస్టు చేశామన్నారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment