బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా జగదీశ్వరనాయుడు
చిత్తూరు కార్పొరేషన్: బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జగదీశ్వర్‌నాయుడుని నియమించినట్లు పార్టీ జిల్లా ఎన్నికల అధికారి ఎల్లారెడ్డి తెలిపారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ సూచనల మేరకు జగదీశ్వర్‌నాయుడుని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీని బలోపేతం చేస్తూ, మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శివనారాయణ, వెంకటేశ్వర చౌదరి, చిట్టిబాబు, శ్రీనివాసులు, రామభద్ర, షణ్ముగం, గురుగణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment