ముగిసిన ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని ఆర్టీసీ టూ డిపోలో మంగళ వారంతో కార్గో మాసోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రజారవాణా అధికారి జగదీష్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో కూడా కార్గో సేవలను విస్తృతం చేయాలన్నారు. డోర్ డెలివరీ సౌకర్యాన్ని కస్టమర్లు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ మాసోత్సవాల సందర్భంగా కస్టమర్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీఐ అల్తాఫ్ పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో ప్రొవిజినల్ మెరిట్ లిస్టు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జాతీయ ఆరోగ్య మిషన్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ లిస్టును ఆన్‌లైన్‌లో పొందు పరిచినట్లు డీఎంఅండ్ హెచ్‌ఓ సుధారాణి తెలిపారు. ఇందులో అభ్యంతరాలుంటే ఈనెల 28వ తేదీలోపు సమర్పించాలన్నారు. గడువు తీరిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించమని చెప్పారు. జాబితాను www.Chittoor.ap.gov.in లో పొందు పరిచినట్లు ఆమె పేర్కొన్నారు.
ఉద్యానవన అభివృద్ధికి రూ.10 లక్షలు
కాణిపాకం: కాణిపాకంలో రూ.10లక్షల వ్యయంతో ఉద్యానవన అభివృద్ధికి చుడా చైర్మన్ కటారి హేమలత ముందుకు వచ్చారు. కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని మంగళవారం చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (చుడా) చైర్మన్ కటారి హేమలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రూ.10 లక్షలతో ఉద్యానవనం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈఓ పెంచల కిషోర్ తో కలిసి పలు స్థలాలు పరిశీలించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, చూడా అధికారులు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
పుంగనూరు: మండలంలోని నేతిగుట్లపల్లె వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.23,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రహస్య సమాచారం మేరకు వలపన్ని పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
12వ పీఆర్సీ పునరుద్ధరించాలి
– డీఆర్వోకు యూటీఎఫ్ నాయకుల వినతి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కారదర్శి జీవీ.రమణ కోరారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు మంగళవారం కలెక్టరేట్‌లో డీఆర్వో మోహన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. డీఆర్వోతో మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటో తేదీ నుంచి 12వ వేతన సవరణ సంఘం అమలులో ఉండాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.20 వేల కోట్ల ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు 7,384 కోట్లు, ఉద్యోగుల సరెండర్ లీవుల ఎన్‌క్యాష్ నగదు 2,250 కోట్లు త్వరతిగతిన మంజూరు చేయాలన్నారు. బకాయిలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమశేఖరనాయుడు, సహాధ్యక్షులు రెడ్డెప్పనాయుడు, ఎస్‌పి భాష,టి.దక్షిణామూర్తి, కే సరిత,డి ఏకాంబరం, ఎం పార్థసారథి, కే గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment