సమగ్ర ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం
– అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి
తవణంపల్లె: ప్రజల సమగ్ర ఆరోగ్యాన్ని పరిరక్షణే తమ ధ్యేయమని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని అర గొండ టోటల్ హెల్త్ కార్యాలయంలో సంక్రమణేతర వ్యాధుల నివారణ, పరిశోధన కార్యక్రమాన్ని డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తవణంపల్లె మండలంలో అపోలో హాస్పిటల్ ద్వారా, టోటల్ హెల్త్ ద్వారా ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. శాటిలైట్ క్లినిక్ ద్వారా హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటును నివారించడం, చికిత్స చేయడంపై టో టల్ హెల్త్ దృష్టి పెడుతోందన్నారు. టోటల్ హెల్త్ ద్వా రా నిర్వహించిన పరిశోధన అధ్యయనంలో సంక్రమణేతర వ్యాధులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడైనట్లు తెలిపారు. ఇందులో అధికంగా మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్, రక్తపోటు బాధితులు ఉన్నట్లు తెలిపారు. యువకుల్లో గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం కారణాలతో అకాల మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పా రు. గ్రామీణ ప్రజల్లో మధుమేహం, ఫ్రీ డయాబిటెక్, అధిక రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్‌పై అపోలో వైద్య కళాశాల, టోటల్ హెల్త్ సంయుక్తంగా పరిశోధనకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందు లో భాగంగా పరిశోధకులు, వైద్యులు ఆరోగ్య ఇంట ర్వ్యూలు, పరీక్షలు, ఈసీజీ, అవసరమైన రోగనిర్దారణ పరీక్షలు కోసం ప్రతి ఇంటిని సందర్శిస్తారని తెలిపారు. మండలంలోని గ్రామీణ ప్రజలకు గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ పరీక్షల కోసం అత్యాధునిక మొబైల్ డయాగ్నస్టిక్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు సహకరిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు విద్య, సాంకేతిక నైపుణ్యం కల్పిస్తామన్నారు. సమావేశంలో సుచరిత రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి, అపోలో ప్రాజెక్టు ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి. వైస్ ప్రెసిడెంట్ నరోత్తమరెడ్డి, టోటల్ హెల్త్ సీఈఓ రాంబాబు, సీఓఓ నరేష్‌కుమార్ రెడ్డి,అరగొండ అపోలో మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, పీఆర్‌ఓ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment