పశు ఉత్పాదకత పెంపే లక్ష్యం
తవణంపల్లె: పశువుల ఉత్పాదకత పెంపే లక్ష్యంగా ఉచిత పశు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ తెలిపారు. మండలంలోని మైనగుండ్లపల్లె, మత్యం, ఎం.బోయపల్లె, యడమలవారిపల్లె గ్రామా ల్లో మంగళవారం పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. మైనగుండ్లపల్లెలో పశు వైద్య శిబిరాలను పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ పశుపోషకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తగిన నిధులు కేటాయిస్తూ పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. పశుసంవర్థక శాఖ సేవలను పశుపోషకులకు మరింత చేరువ డానికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. పశు వైద్యులతో పరీక్షలు చేయించి, ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తేలికపాటి శస్త్ర చికిత్సలతో పా టు ఎదకు రాని, చూలు కట్టని పశువులకు, గర్భకోశవ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లె పశువైధ్యాధికారి డాక్టర్ లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment