దివ్యాంగుని అవస్థ
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాకు ఏకసభ్య కమిషన్ చైర్మన్ విచ్చేస్తున్నారని తెలుసుకుని, ఆయనకు చెప్పుకుంటే తన సమస్య తీరుతుందనే ఆశతో చిత్తూరు నగరానికి చెందిన దివ్యాంగుడు మణి మంగళవారం కలెక్టరేట్‌కు విచ్చేశాడు. కలెక్టరేట్‌లోని లిప్టు పనిచేయకపోవడంతో మూడో ఫ్లోర్‌లో ఉన్న సమావేశ మందిరానికి మెట్లపై పాకుకుంటూ వెళ్లి ఉన్నతాధికారులకు తన సమస్యను విన్నవించుకున్నాడు. చాలా సంవత్సరాలుగా దివ్యాంగ వాహనం కోసం దరఖాస్తు చేసుకుంటున్నా మంజూరు చేయడం లేదని అధికారులకు తెలియజేశాడు. పరిశీలించి న్యాయం చేస్తామని కలెక్టర్ ఆ దివ్యాంగునికి హామీ ఇచ్చాడు. కలెక్టరేట్‌లోని లిఫ్టు తరచూ పాడవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. లిఫ్టు పనిచేయకపోవడంతో మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగేటప్పుడు ఆ దివ్యాంగుని దుస్థితిని చూసిన పలువురు చలించిపోయారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి లిఫ్టు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment