మామిడి చెట్ల కూల్చివేత
● రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం ● 35 మామిడిచెట్లు కూల్చివేసిన అధికారులు
గుడిపాల: నష్టపరిహారం అందించకనే ఓ రైతుకు చెందిన మామిడి చెట్లను ఎక్స్‌ప్రెస్ హైవే అధికారులు కూల్చివేశారు. చలిచీమలపల్లె గ్రామానికి చెందిన సుబ్రమణ్యంనాయుడికి చెందిన భూమి చైన్నె–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేకు గతంలోనే కొంతభూమి పోయింది. ప్రస్తుతం అదనంగా మరో 0.40 సెంట్లు భూమిలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని, భూమి కావాలని అతనికి ఎక్స్‌ప్రెస్ హైవే అధికారులు నోటీసు అందించారు. ఆ రైతు తనకు సరైన నష్టపరిహారం ఇస్తే తన భూమిని ఇస్తానని చెప్పాడు. దీంతో అతను అధికారుల మాట వినలేదని గుడిపాల తహసీల్దార్‌తోపాటు రెవెన్యూ అధికారుల బృందం సుబ్రమణ్యంనాయుడి పొలం వద్దకు వెళ్లి, అక్కడున్న 35 మామిడి చెట్లను జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఆ రైతు ఎంతమొత్తుకున్నా వినకుండా తమ పని తమదే అంటూ కానిచ్చేశారు. దీంతో ఆరైతు లబోదిబోమంటున్నాడు. నష్టపరిహారం అందజేయక ఇలాంటి పనులు చేయడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment