నిబంధనలు పాటించకుంటే చర్యలు
చిత్తూరు కార్పొరేషన్: పంచాయతీరాజ్ నిబంధనలు విఽధిగా పాటించాలని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు ఆదేశించారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా జెడ్పీ పరిధిలో పనిచేస్తున్న ఏఓలకు నిర్వహించిన శిక్షణ తరగతిలో మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని సృష్టం చేశారు. మండల పరిషత్ సర్వసభ సమావేశాల్లో వేదికపై ఎవరు కూర్చోవాలనే విషయంలో నిబంధనలు ఉంటాయని, వాటిని విధిగా పాటించాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. మహిళ ఎంపీటీసీ సభ్యుల భర్తలు, కుమారులు సమావేశాలకు వస్తున్నట్లు తెలి సిందన్నారు. సభ్యులు కానివారిని సర్వసభ్య సమావేశంలోనికి అనుమతించ రాదని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment