పరిహారం.. | - | Sakshi
Sakshi News home page

పరిహారం..

Published Sun, Jan 26 2025 7:11 AM | Last Updated on Sun, Jan 26 2025 7:11 AM

పరిహా

పరిహారం..

‘గణ’తంత్ర ‘ముస్తాబు’
చిత్తూరులో ఆదివారం జరగనున్న గణతంత్ర వేడుకలకు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఘనంగా ముస్తాబు చేశారు.

ఆదివారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2025

స్వేదాన్ని చిందించి.. ఆరుగాలం శ్రమించి.. పంటలు సాగు చేసిన పుడమి పుత్రులకు పెద్ద కష్టమొచ్చింది. అతివృష్టి, అనావృష్టితో అన్నదాత అల్లాడుతున్నాడు. సాగుకు అప్పు చేశాడు. దిగుబడి చేతికందక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అప్పు తీర్చే దారిలేక కుంగిపోతున్నాడు. చేయూత నివ్వాల్సిన కూటమి సర్కారు సాయం అందించడంలో జాప్యం చేస్తోంది. ఓ వైపు రబీ సీజన్‌ మొదలవుతోంది.. సాగుకు అప్పు పుట్టక..హలం పట్టలేక.. కునారిల్లుతున్నాడు. అయినా ప్రభుత్వం పరిహారం అందుతుందా? లేక రిక్తహస్తం మిగులుతుందోనని ఆవేదన చెందుతున్నాడు. ఇదీ జిల్లాలో కర్షకుల పరిస్థితి.

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): ప్రకృతి ప్రకోపంతో రైతన్న కుదేలయ్యాడు. సకాలంలో వర్షాలు లేక వేరుశనగ చేతికందకుండాపోయింది. అకాల వర్షాలతో వరి..ఇతర పంటలు నేలమట్టమయ్యాయి. దెబ్బతిన్న ఆ పంటలకు సంబంధించి అధికారులు నష్టం అంచనా వేసి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. అయినా నష్ట పరిహారం అందనంటోంది. రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విషయంలో పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని రైతులు మండిపడుతున్నారు.

కన్నీరు మిగిల్చిన ఖరీఫ్‌

గత ఖరీఫ్‌ సీజన్‌ కర్షకులకు కన్నీరు మిగిల్చింది. తొలుత సకాలంలో వర్షాలు కురక పంట ఎండిపో యింది. ఆ తరువాత వచ్చిన తుపాన్ల కారణంగా బో ర్లు, జలవనరుల కింద సాగు చేసిన పంటలు దెబ్బతినడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. గతేడాది ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 43,174 హెక్టార్లుగా కాగా 13,044 హెక్టార్లల్లో పంట సాగైంది. అయితే వర్షం కురకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతింది. చివరకు చెట్టుకు రెండు కాయలు, తీగలు చేతికి రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురైతే 9 వేల హెక్టార్లల్లో మాత్రమే పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. 24,342 మంది రైతులకు గాను రూ.15.42 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఈ మేరకు ప్రభుత్వం గుడిపాల, పెనుమూరు, యాదమరి మండలాలను అత్యంత కరువు మండలాలుగా ప్రకటించింది. శ్రీరంగరాజుపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచెర్ల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లి, వీ.కోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం మండలాలలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించింది. ఈనేపథ్యంలో పది రోజులకు క్రితం కేంద్ర బృందం కూడా యాదమరి, గుడిపాల మండలాలను సందర్శించి ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించింది. అలాగే మిగిలిన మండలాల్లో కూడా వేరుశనగ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి కూడా నష్ట పరిహారం చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

తుపాను తెచ్చిన తంటా

వర్షాలు అదునుకు కురవగా ఖరీఫ్‌ రైతుల కొంప ముంచింది. ప్రధానంగా వేరుశనగ పంటను తీవ్రంగా నష్టపరిచింది. తీరా భారీ వర్షాల కారణంగా పలు రకాల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది కలసి రెండు విడతలుగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించారు. పుంగనూరు, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీనెల్లూరు తదితర నియోజకవర్గాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయని గుర్తించి, ఫొటోలతో నష్టాన్ని గణాంకాలతో సహ జిల్లా అధికారులకు తెలియజేశారు. ఈ లెక్కన్న జిల్లా వ్యాప్తంగా 1,479 మంది రైతులకు గాను 529.517 హెక్టార్లల్లో వరి పంట దెబ్బతిన్నట్లు నివేదించారు. ఇందుకు గాను హెక్టారుకు రూ.17 వేల చొప్పున్న రూ.90.05 లక్షల నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అలాగే ఉద్యాన శాఖ పరిధిలో మిరప సాగు 24.50 హెక్టార్లు, టమాట 12.75 హెక్టార్లు, కాలీఫ్లవర్‌ 0.20 హెక్టార్లు, కాకరకాయ 0.82 హెక్టార్లు, తమలపాకు 0.75 హెక్టార్లు, సొరకాయ 1.50 హెక్టార్లతో పాటు మరిన్ని పంటలు కూడా తీవ్రంగా నష్టపోయినట్లు నిర్థారించినట్లు అందులో పేర్కొన్నారు.

పరిహారం ఏదీ

ఖరీఫ్‌లో వేరుశనగ పంట తీవ్రంగా నష్టపోయిన ఇంతవరకు పరిహారం అందని పరిస్థితి. ఇదే మాదిరిగానే తుపాను, వర్షాలకు దెబ్బతిన్న శాఖల వారీగా పరిహారం కోసం ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నోరు విప్పడం లేదు. అధికారులకే దీనిపై ఎలాంటి స్పష్టత లేదని తెలుస్తోంది. నెలలు గడుస్తున్న ఖరీఫ్‌లో దెబ్బతిన్న వేరుశనగ, తుపాను ప్రభావంతో నేలమట్టమైన వరి, ఇతర పంటలకు పరిహారం ఇవ్వడం లేదని బాధిత రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం బోరు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్న వెంటాడుతున్న ఆర్థిక కష్టాలతో సాగుపై దృష్టి పెట్టలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. అలాగే అన్నదాత సుఖీభవతో ఆదుకోవాలని, లేకుంటే రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వారు వాపోతున్నారు.

గంగాధరనెల్లూరు మండలంలో నేలకొరిగిన వరి పంట

ఎం.కొత్తూరు పాఠశాలలో విచారణ

నగరి: కొందరు విద్యార్థుల దురుసు ప్రవర్తనతో మండలంలోని ఎం.కొత్తూరు పాఠశాలకు గ్రామస్తులు తాళం వేయడం.. ఇలాంటి పాఠశాల మాకొద్దు అంటూ నినదించిన వ్యవహారంపై అధికారులు దృష్టి సారించా రు. శనివారం ఆర్డీఓ భవానీశంకరి ఆధ్వర్యంలో ఉమన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ పీడీ, డీవైఈఓ ప్రభాకర్‌రాజు, ఎంఈఓలు శ్రీదేవి, నమశ్శి వాయం, ఎకై ్సజ్‌ డీఎస్పీ, సీఐ శ్రీనివాసులురెడ్డి, లా అండ్‌ ఆర్డర్‌ సీఐ మహేశ్వర్‌, సీడీపీ ఓ కృష్ణవేణిలతో కూడిన ఒక కమిటీ పాఠశాలలో విచారణ చేపట్టింది. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వి ద్యార్థులు, గ్రామస్తులను విడివిడిగా విచా రించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. అనంతరం ఆందోళన చేపట్టిన గ్రామస్తుల తో ఆర్డీవో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, రెండు రోజుల్లో మార్పు కనిపిస్తుందన్నారు. ప్రవర్తన లోపాలున్న విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. శాంతియుత వాతావరణంలో పాఠశాల సక్రమంగా జరిగేలా చూసే బాధ్యత తమదని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఎంఈఓలు తరచూ పాఠశాలను తనిఖీ చేస్తారన్నారు. విద్యార్థుల్లో దురుసు ప్రవర్తనలో మార్పు వచ్చేలా పోలీసు అధికారులు పాఠశాలకు నిర్ణీత సమయాల్లో విచ్చేసి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తారన్నారు.

– IIలో

– IIలో

న్యూస్‌రీల్‌

ఖరీఫ్‌ వివరాలివీ

వేరుశనగ సాగు విస్తీర్ణం 13,044

హెక్టారు సాగుకు ఖర్చు సుమారు రూ.40 వేలు

వేరుశనగ రైతులకు నష్టం సుమారు రూ.52.17 కోట్లు

వరి సాగు విస్తీర్ణం 11వేల హెక్టార్లు

హెక్టారుకు సాగు ఖర్చు సుమారు రూ.60 వేలు

పంట నష్టం సుమారు రూ.66 కోట్లు

అధికారుల వేసిన అంచనా వివరాలివీ..

వేరుశనగ పంట నష్టం అంచనా 9 వేల హెక్టార్లు

నష్టపోయిన రైతుల సంఖ్య 24,342

నష్టం విలువ రూ.15.42కోట్లు

తుపాన్‌కు వరి పంట నష్టం 523.517 హెక్టార్లు

వరి సాగుకు ఖర్చు రూ.17 వేలుగా నిర్ధారణ

మొత్తం నష్టం రూ.90.05 లక్షలుగా నిర్ధారణ

అత్యంత కరువు మండలాలు 3

మధ్యస్థ కరువు మండలాలు 13

ఆరు నెలల్లో పంటలపై ప్రకృతి విలయం

దెబ్బతిన్న పంటలు

అదునుకు వర్షాలు లేక వేరుశనగ నేలమట్టం

తుపానులతో వరికి ఉరి

అందని పరిహారం

ఎదురుచూపుల్లో రైతులు

ఈ చిత్రంలో నేలమట్టమైన వరి పంట చిత్తూరు మండలం పచ్చనపల్లి గ్రామంలోనిది. గతేడాది శేఖర్‌ అనే రైతు నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశారు. రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షానికి పంట నేలమట్టం అయ్యింది. దెబ్బతిన్న ఈ పంటను అధికారులు కూడా అంచనా వేసి ఫొటోలు తీసుకెళ్లారు. కానీ ఇంతవరకు పంట పరిహారం దక్కలేదని రైతు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పరిహారం.. 1
1/9

పరిహారం..

పరిహారం.. 2
2/9

పరిహారం..

పరిహారం.. 3
3/9

పరిహారం..

పరిహారం.. 4
4/9

పరిహారం..

పరిహారం.. 5
5/9

పరిహారం..

పరిహారం.. 6
6/9

పరిహారం..

పరిహారం.. 7
7/9

పరిహారం..

పరిహారం.. 8
8/9

పరిహారం..

పరిహారం.. 9
9/9

పరిహారం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement