పుత్తూరులో తుపాకీ కలకలం!
పుత్తూరు: చంపుతానంటూ ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ తనకు తుపాకీ చూపి బెదిరించాడంటూ పుత్తూరు మండ లం తిమ్మాపురం గ్రామానికి చెందిన పి.రాజా అనే వ్యక్తి శనివారం స్థానిక పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు రాజా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. స్థానిక సెంగుథర్ వీధిలో షణ్ముగ హాస్పిటల్ నడుపుతున్న ఇ.మునిరాజా అలియాస్ చిన్నా అనే ఆర్‌ఎంపీ డాక్టర్ ఈనెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రాజాకు ఫోన్‌చేసి పున్నమి హోటల్ వద్దకు రమ్మని పిలిచాడు. అక్క డకు వెళ్లిన రాజాకు డాక్టర్ మునిరాజా భుజానికి తగిలించుకుని ఉన్న బ్యాగులో నుంచి తుపాకీని తీసి ‘కాల్చి చంపేస్తాన్‌రా.. ఏమనుకుంటున్నావ్ రా నువ్వు, నీ మామ. ఇదేమైనా డూప్లికేట్ పిస్తోల్ అనుకుంటున్నావా? ఎత్తి చూడు దీని వెయిట్ తెలుస్తుంది’ అంటూ బెదిరించాడు. దీంతో అక్కడి నుంచి ఎలాగో రాజా తప్పించుకుని గ్రామానికి చేరి జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ విషయం గ్రామస్తులందరికీ చెప్పి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మునిరాజ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన కుటుంబాన్ని రక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సీఐ సురేంద్రనాయుడు మాట్లాడుతూ రాజా నుంచి అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
పూతలపట్టు(కాణిపాకం): రోడ్డు దాటుతుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొన్ని యువకుడు మృతి చెందిన ఘటన శనివారం పూతలపట్టులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా...మండలంలోని తేనేపల్లి బీదరామిట్టకు చెందిన నవీన్(27) అనే యువకుడు రంగంపేట క్రాస్‌కు కాలినడకన వెళుతున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఆ యువకుడి ఢీకొంది. దీంతో సంఘటన స్థలంలో మృతి చెందాడు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment