పంటలపై ఏనుగుల దాడి
బంగారుపాళెం: మండలంలోని బోడబండ్ల పారెస్టు బీట్ పరిధిలో ఏనుగులు రైతుల పంటలపై దాడి చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి బోడబండ్ల, జంబునేరేడుపల్లె, దిగువ ఎద్దులవారిపల్లె గ్రామాల్లో పంటలపై ఏనుగులు దాడి చేసి, ధ్వంసం చేయాలని రైతులు వాపోయారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు రైతుల పొలాలపైకి వచ్చాయని అంటున్నారు. బోడబండ్లకు చెందిన రైతు వరి పొలం తొక్కేశాయన్నారు. దిగువ ఎద్దులవారిపల్లెకు చెందిన రమాణారెడ్డి, గోంవింద స్వామికి చెందిన మామిడితోటల్లో చెట్లకొమ్మలను విరిచేశాయన్నారు. జంబునేరేడుపల్లెలో శంకరయ్యకు చెందిన గడ్డిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అలాగే అరటి, కొబ్బరి చెట్లను విరిచే శాయన్నారు. గత 20 రోజులుగా బోడబండ్ల సమీపంలోని పాతూరుబండ అటవీ ప్రాంతంలో 15 ఏనుగులు మకాం వేశాయని అన్నారు. రాత్రి సమయంలో ఏనుగులు పంటలపై వరుస దాడులు చేస్తూ తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. బాధిత రైతులకు పంట నష్టపరిహారం చెల్లించేందుకు కృషి చేస్తామని బంగారుపాళెం పారెస్ట్ సెక్షన్ అధికారి మోహన్ మురళి తెలిపారు. ఏనుగులు మందను మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా తిరిగి వస్తూనే ఉన్నాయన్నారు. గత 20 రోజులుగా సిబ్బంది, ట్రాకర్లు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment