వీఓఏల జీతాలు వెంటనే మంజూరు చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల(వీఓఏ)కు పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల జీతాలు వెంటనే మంజూరు చేయాలని ఏపీ వెలుగు యానిమేటర్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘ నాయకులు కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. పీడీతో ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ ఏడు నెలల పెండింగ్ జీతాల మంజూరు కోసం ఈ నెల 27, 28, 29 తేదీల్లో కలెక్టరేట్ వద్ద మౌనదీక్ష చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ ఏడు నెలలుగా జీతాలు లేకపోతే వీఓఏలు ఎలా జీవనం కొనసాగించాలని ప్రశ్నించారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అక్రమంగా తొలగింపులు ఈ ప్రభుత్వంలో తీవ్రంగా ఉన్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment