టీడీపీ నేత దౌర్జన్యం
రాతి కూసాలను తొలగింపు
శ్రీరంగరాజపురం: కూ టమి నాయకులు దౌ ర్జన్యం రోజురోజుకు పెరిగిపోతోంది. మండలంలోని పీవీ పురం గ్రామానికి చెందిన నీల పార్వతమ్మ తమ పొలానికి రక్షణగా ఫెన్సింగ్ వేసుకుంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అప్పలరాజు తన పొలానికి నీటి సరఫరా కోసం పైపులైన్ వేసుకోవడానికి నీల పార్వతమ్మ పొలానికి రక్షణగా నిర్మించుకున్నా ఫెన్సింగ్‌ను ఎమ్మెల్యే థామస్ స్వగ్రామమైన అల్లగుంట గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను తీ సుకువచ్చి ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వం తమ పొలానికి రక్షణ లేకుండా పోయిందని, ఇంత దౌర్జన్యం చేస్తుంటే తాము ఎలా బతాకాలని బాధితురాలు నీల పార్వతమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధిత విషయంపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment