గణతంత్ర ముస్తాబు
చిత్తూరు అర్బన్: నగరంలో ఆదివారం జరుపుకోనున్న 76వ గణతంత్ర వేడుకలు (రిపబ్లిక్‌డే)కు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని అందంగా ముస్తాబు చేశారు. జాతీయ పతాక వందనం కోసం స్టేజీ నుంచి వీక్షకులు కూర్చోవడానికి ఏర్పాట్లు, అందమైన రంగవల్లులు, ఎర్రకోట సెట్టింగ్‌లను సిద్ధం చేశారు. ఇక పోలీసుల కవాతు ఎలా నిర్వహించాలో ట్రయల్ కూడా చూశారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ సుమిత్‌కుమార్ జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, విధుల్లో ప్రతిభ చూపించిన ఉద్యోగులకు పురస్కారాలు, పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment