జిల్లాకు ఐసీటీసీ వాహనం
చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు జిల్లాకు ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్, టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ) వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. శనివారం జిల్లా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి వెంకటప్రసాద్‌కు వాహనాన్ని అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ వాహనం మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడ హెచ్‌ఐవీ టెస్టులు నిర్వహిస్తోంది. పాజిటివ్ వచ్చిన రోగుల వివరాలను గోప్యంగా ఉంచి ఏఆర్టీ కేంద్రాలకు తెలియజేస్తుందన్నారు. ఈ వాహనం ద్వారా రోజుకు 200 మందికి పైగా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
డిజిటల్ వనరులు వినియోగించుకోండి
కార్వేటినగరం: ఉపాధ్యాయులు డిజిటల్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని, విదార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయా లని జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్) ప్రిన్సిపల్ డాక్టర్ వి.శేఖర్ అన్నారు. శనివారం డైట్ ఆడిటోరియంలో తరగతిగది బోధనలో డిజిటల్ వనరుల వినియోగం అనే అంశంపై ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ఽ మాట్లాడుతూ సాంకేతికరంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతను ఉపాధ్యాయులు అందిపుచ్చుకుని, తమ తరగతి గదిలో బోధనను మెరుగు పరుచుకోవాలని సూచించారు. శిక్షణా సంచాలకులు అలాగే డైట్ అధ్యాపకులు బి. చెంగల్ రాజు మాట్లాడుతూ కృతిమ మేధ అంశంపై ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణ కార్యక్రమం గతంలో ఎప్పుడూ నిర్వహించలేదన్నా రు. నీలకంఠయ్య, మనోహర్, కల్పన, శశిరేఖ రిసోర్సు పర్సన్లుగా వ్యవహరించారు.
ఏడీఆర్ చెల్లించకుంటే నోటీసులు ఖాయం
చిత్తూరు కలెక్టరేట్ : అడ్వాన్స్ డెడ్ రెంట్ (ఏడీఆర్) చెల్లించకుంటే నోటీసులు ఖాయ మని జిల్లా గనులు, భూగర్భశాఖ (మైన్స్) డీడీ సత్యనారాయణ అన్నారు. శనివారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని క్వారీ యజమానులు కచ్చితంగా ఏడీఆర్ చె ల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. 2024–25 వ ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.135 కోట్లు టార్గెట్ విధించినట్లు చెప్పారు. కాగా ఇప్పటి వరకు రూ.87.45 కోట్లు వసూలు చేశామన్నారు. జిల్లాలో బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానై ట్, మెటల్ బిల్డింగ్ స్టోన్ గ్రావెల్ వంటివి 423 పరిశ్రమలకుగాను ప్రస్తుతం 217 పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు ఏడీఆర్ చెల్లించినవా రు ఈ నెలాఖరులోపు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో ఫిబ్రవరి మొదటి వారంలో నోటీసులు ఇస్తామన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ లోపు కట్టని వారికి అపరాధ రుసుముతో మార్చి 15 వరకు గడువు ఉంటుందని చెప్పారు. మార్చి నెల త ర్వాత కట్టని వారి క్వారీ లైసెన్సులు రద్దు చే స్తామని హెచ్చరించారు. కాగా జిల్లా నెల వారీ ఫండ్ (డీఎంఎఫ్) లో గత ఏడాది జూన్ వరకు వసూలైన రూ.62 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయితే వార్షిక లక్ష్యం పెరుగుతుందని డీడీ వెల్లడించారు.
సస్యరక్షణతో అధిక దిగుబడులు
వి.కోట: మామిడి సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖాధికారి మధుసూదన్ రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని వె లుగు కార్యాలయంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మామిడిలో సస్యరక్షణపై రైతులకు శిక్షణ నిర్వహించారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి మా ట్లాడుతూ మామిడి పూత అంతా ఒకేసారి రావడానికి పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, అర్కా మాంగో స్పెషల్ 5గ్రాములు లీటర్ నీ టికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మా ట్లాడుతూ అధికారుల సూచనలను సద్వినియో గం చేసుకోవాలన్నారు. అనంతరం రైతులకు కరపత్రాలు పంపిణీ చేశారు. రామచంద్రనాయుడు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment