శ్మశాన దారిని ఆక్రమించారని ధర్నా
గంగవరం: తమ గ్రామ శ్మశానవాటికకు వెళ్లే దారిని ఆక్రమించి, అందులో వెంచర్ వేస్తే తమకు దారెలా అని గంగవరం గ్రామస్తులు శనివారం రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమ గ్రామ శ్మశాన దారిని ఆక్రమించడంపై గ్రామస్తులు తమ అభ్యంతరాలు తెలిపారు. గ్రామంలో సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగవరం ఫ్‌లైఓవర్‌కు సమీపంలోని సర్వే నంబర్ 336, 336(1)లో రహదారి నుంచి సమీపంలోని కుంట వరకూ దారి, వాగు ఉండేది. ఆ దారి మీదుగా శ్మశానవాటికకు ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్నామన్నారు. ఆ దారి ఆక్రమణకు గురై లేఅవుట్ వెంచర్ వెలిసిందన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ధర్నా ఉధృతం చేస్తామన్నారు. స్పందించిన రెవెన్యూ సిబ్బంది సర్వేయర్లు కలిసి వెంటనే లేఅవుట్ వద్దకు వెళ్లి సర్వే చేశారు. శ్మశానానికి కచ్చితంగా దారి కల్పిస్తామంటూ గ్రామస్తులకు అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment