108 వాహనంలో ప్రసవం.. మగ బిడ్డ జననం
నగరి : నెలలు నిండిన గర్భిణికి పురిటి నొ ప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే ప్రసవించింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. నిండ్ర మండలంలోని కొప్పేడు గ్రామాని కి చెందిన జ్యోతిక (23) నిండు గర్భిణి. ఆమెకు శనివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవించింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆమెను నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు.
పశుసంవర్థకశాఖలో ఇద్దరికి ఉత్తమ అవార్డులు
చిత్తూరు రూరల్(కాణిపాకం): పశువైద్యసేవ లు, పథకాల అమలులో మెరుగైన సేవలందించినందుకు జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ ప్రభాకర్, చిత్తూరు డీడీ అబ్దుల్ హరీఫ్‌కు ఉత్తమ సేవ అవార్డు వరించింది. గణతంత్ర దినోతవం సందర్భంగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ కార్యాయలంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఆ శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు చేతులు మీదుగా అవార్డు అందుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
బెల్టుషాపు నిర్వాహకుల అరెస్టు
కుప్పంరూరల్: మండలంలోని వెండుగంపల్లి, నడుమూరు వద్ద బెల్టుషాపులు నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి భారీగా మ ద్యం స్వాధీనం చేసుకున్నట్లు కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య తెలిపారు. వెండుగంపల్లి బెల్టుషాపు నిర్వహిస్తున్న మూర్తి అలియాస్ రెమో వద్ద రూ.14,130 విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే నడుమూరు చెక్ సమీపంలో ఓ దుకాణంలో మద్యం విక్రయిస్తున్న శబరీ, బాబును అరెస్టు చేసి వారి నుంచి రూ.58,788 విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సీఐ శంకరయ్య మాట్లాడుతూ ఎవరైనా బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని, అలా నిర్వహిస్తే తమ దృష్టికి తేవాలని స్థానికులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment