ఉత్తమ విధులకు పురస్కారాలు
చిత్తూరు కలెక్టరేట్ : గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ విధులు నిర్వహించినందుకు గాను ఎస్పీ మణికంఠ చందోలు, కలెక్టరేట్ ఎన్నికల టెక్నికల్ ఉద్యోగి ఉమా పతి అవార్డులు అందుకున్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన 15వ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ మణికంఠ చందోలు పారదర్శకత, శాంతిభద్రతల విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కృషి చేశారు. సార్వత్రిక ఎన్నికల కసరత్తులో నిబద్ధతో విధులు నిర్వర్తించినందుకు పురస్కారం స్వీకరించడం గర్వంగా ఉందని కలెక్టరేట్ ఎన్నికల విభాగం టెక్నికల్ ఉద్యోగి ఉమాపతి తెలిపారు.
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
గంగవరం: గ్రామాల్లో సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు అధికారులను ఆదేశించారు. గంగవ రం సచివాలయంతోపాటు మండల పరిషత్ కార్యాలయాన్ని డీఎల్‌డీఓ రవికుమార్‌తో కలి సి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యపై అధికారులు శ్రద్ధ చూపి, అవసరమైన చోట నిధులు మంజూరు చేసి, బోర్లు, పైపులైన్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలని సూచించారు. ఎంపీడీఓ సురేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
అవార్డు అందుకుంటున్న ఎస్పీ మణికంఠ, కలెక్టరే ట్ ఎన్నికల విభాగం టెక్నికల్ ఉద్యోగి ఉమాపతి
Comments
Please login to add a commentAdd a comment