సంపద కేంద్రాల రాబడితో గ్రామాభివృద్ధి సాధ్యం
ఐరాల: చెత్త సంపద కేంద్రాల ద్వారా పంచాయతీలకు వచ్చే ఆదాయంతో గ్రామాభివృద్ధి సాధ్యమని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ సుధాకర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కాణిపాకం చెత్త సంపద కేంద్రాన్ని సీఈఓ, డీపీఓ స్థానిక సర్పంచ్ శాంతిసాగర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డులో వర్మీ కంపోస్టు తయారీ, ప్లాస్టిక్ కటింగ్ మెటీరియల్, వర్మీ కంపోస్టు విక్రయ కౌంటర్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఈఓ, డీపీఓ మాట్లాడుతూ కాణిపాకం పంచాయతీ చెత్త సంపద కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన పంచాయతీల్లోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లను ఇలాగే తయారు చేయాలని ఈఓపీఆర్డీ కుసుమకుమారిని ఆదేశించారు. చెత్త సేకరణ, వర్మీ కంపోస్టు తయారీతో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కావడంతోపాటు పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు. షెడ్డుకు త్వరితగతిన ప్రహారీగోడ నిర్మాణం చేపట్టాలని సర్పంచ్‌ను కోరారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫామ్, చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ సర్పంచ్ విశ్వనాథరెడ్డి, వార్డు సభ్యులు సౌందర్‌రాజన్, వేణుగోపాల్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment