చింత
బతుకు
కట్టి చింతకాయ బస్తాలను లారీకి లోడ్ చేస్తున్న కూలీలు,(ఇన్‌సెట్) బిస్కెట్లుగా తయారు చేసిన చింతపండు
దక్కని గిట్టుబాటు..ఆగిన ఎగుమతులు..కోల్డ్‌స్టోరేజీల్లో పేరుకున్న నిల్వలు.. తగ్గుతున్న నాణ్యత.. ముంచుకొస్తున్న సీజన్..వెరసి.. చింతపండు పరిశ్రమ కునారిల్లు తోంది. ఫలితం.. గోడౌన్ల అద్దె చెల్లించలేక, వడ్డీలు కట్టలేక, రుణం తీర్చలేక వ్యాపా రులు అప్పుల ఊబిలో కూరుకుపోయా రు.. కూలీలు, రైతులకు బతుకు చింత అయ్యింది. ధరలు లేకపోవడంతో కుదేలైన చింతపండు పరిశ్రమపై కథనం.
పన్ను మినహాయింపు
చింతపండు ధరలు లేని సమయంలో చింతపండు వ్యాపారులు రైతులపై సేల్‌ట్యాక్స్ అధికారుల దాడులు తీవ్రమయ్యాయి. 2018 సంవత్సరంలో సేల్‌ట్యాక్స్ అధికారులు దాడులు చేసి రూ.లక్షల మేరకు పన్నులు విధించి, స్టాక్ సీజ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి స్పందించారు. సొంత నియోజకవర్గంలో వ్యాపారుల వేధింపులపై ఆందోళన చెందారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే చింతపండుకు జీఎస్టీ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చింతపండుకు పన్ను మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పలుమార్లు చర్చలు జరిపారు. చింతపండుకు పన్ను మినహాయింపు తీసుకొచ్చారు. ఇది వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చింది.
● ధరలు, ఎగుమతులు లేవు
● ఏడాదిగా కోల్డ్‌స్టోరేజ్‌లో మగ్గుతున్న చింత పండు
● 15 వేల మందికి ఉపాధి కరువు
పుంగనూరు: రాష్ట్రంలో పుంగనూరు చింత పండుకు ప్రసిద్ధి. సుమారు శతాబ్దం కాలంగా పుంగనూరు నియోజకవర్గంలో చింత పండు పరిశ్రమలో సుమారు 15 వేల మంది పనిచేస్తుండగా వారిలో సుమారు 10 వేల మంది మహిళలు ఉన్నారు. చింతపండు తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకుని జీవనం సాగిస్తున్నా రు. ధరలు, ఎగుమతులు లేకపోవడంతో స్థానిక ఉన్న 9 కోల్డ్‌స్టోరేజ్‌లలో సుమారు 2 వేల లోడ్ల చింతపండు మగ్గిపోతుండడంతో చింతపండు వ్యాపారు లకు తీవ్ర నిరాశమిగులుతోంది. దీని కారణంగా వ్యా పారులు, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయా రు. చింతపండును గిట్టుబాటు ధరలతో ప్రభుత్వం కొనుగో లు చేయాలని రైతులు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే చింతపండు వ్యాపారం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోల్డ్ స్టోరేజ్‌ల్లో చింత నిల్వలు
పుంగనూరు పట్టణం సమీపంలోని ఎంబీటీ రోడ్డులో శ్రీనివాస, మురుగన్, కేఎన్‌ఎం, కృష్ణా, ఎంకేబీ, వెంకటేశ్వర, హిమాలయ, ఎస్‌ఏబీ, బాలాజీ కోల్డ్ స్టోరేజ్ లున్నాయి. వీటిల్లో సుమారు 2 వేల లోడ్ల చింత పండు నిల్వ ఉన్నట్లు సమాచారం.
చింత తీరకపోతోంది
ఏ ఏటా కొనుగోలు చేసిన చింతపండును ఆ ఏడాది విక్రయిస్తారు. లేకపోతే చింతపండు రంగుమారి, ధర లు పడిపోతుంది. గత ఏడాది ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో చింతపండు వ్యాపారం కుప్పకూలిపోయింది. పుంగనూరులో వేలాది లారీల సరుకు నిల్వ ఉండిపోయింది. ఇది ఇలాఉండగా కొ త్తగా పంట రావడంతో మరో మూడు వేల లారీల స రుకు ఏప్రిల్ నెలలోపు గోడౌన్లకు చేరనున్నది. గత ఏ డాది సరుకు విక్రయాలు కాకపోవడంతో రైతులు, వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చింతపండును ప్రభుత్వం కొనుగోలు చేసి, వ్యాపారులను, రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
చింతపండు ధరలిలా..
ప్రస్తుతం చింతపండు ధరలు ఇలా ఉన్నాయి. 10 ట న్నుల కట్టికాయ ధర రూ.3.50 లక్షలు ఉంది. అలాగే సుమారు రూ.10 లక్షల విలువైన 10 టన్నులు చింతపండు ఉంది. కట్టికాయ కిలో రూ.35, చపాతి ఒకటి ధర రూ.80 నుంచి రూ.100 వరకు, ఫ్లవర్ రూ.80 నుంచి రూ.100, కరిపులి కిలో రూ.100 నుంచి రూ.130 వరకు పలుకుతున్నాయి.
చింతపండు తయారీ ఇలా..
పుంగనూరులో చింతచెట్లు అధికంగా ఉండడంతో జన వరి నుంచి మార్చి నెలాఖరు వరకు చెట్లలో ఉన్న కా యలు రాల్చడం, వాటిని ఒబ్బిడి చేసి, కట్టికాయగా మార్చడంలో పురుషులు, సీ్త్రలు ఎక్కువగా భాగస్వాములవుతారు. వ్యాపారులు పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో మండీలు ఏర్పాటు చేసి, చింతకాయను కొట్టించి, ఒబ్బిడి చేసి కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ చేస్తున్నారు.
దిగుమతి
చింతపండును స్థానికంగా కొనుగోలు చేయడంతోపా టు కర్ణాటక రాష్ట్రంలోని గుండల్‌పేట, మాండ్యా, చింతామణి, శ్రీనివాసపురం, సిరా, టుంకూరు, చెల్లకిరి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నిజమాబాద్, బిహార్ లోని రాంచి, జగదల్‌పూర్, రాయపూర్, తదితర ప్రాంతాల నుంచి సుమారు 30 వేల టన్నుల చింతకాయ(కట్టికాయ) దిగుమతి చేసుకుంటారు. వాటిని ప్రజల ఇళ్లకు తరలించి, పండుగా, చపాతీగా, ఫ్లవర్‌గా, కరిపులిగా తయారు చేయిస్తారు.
వ్యాపారం చేయలేకపోతున్నాం
చింతపండుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చింతపండు ఏసీ గోడౌన్లలో మగ్గిపోతోంది. దీంతో వ్యాపారం చేయలేకపోతున్నాం. ఈ ఏడాది తిరిగి పంట భారీ స్థాయిలో వస్తోంది. ఈ తరుణంలో సరుకు కొనలేక, ఏసీ గోడౌన్లకు అద్దె చె ల్లించలేక, పెట్టుబడికి వడ్డీలు కట్టలేక, కూలీలు ఇవ్వలేక పోతున్నాం. చివరకు అప్పులు మిగులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చింతపండు వ్యాపారం కన్నీరు తెప్పిస్తోంది. కుటుంబాలను వీధినపడేస్తోంది. విధిలేక తరతరలుగా వస్తున్న వ్యాపారాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం వ్యాపారులు, రైతులను ఆదుకోవాలి. – ఎస్.హఫీజ్‌ఖాన్, చింతపండు వ్యాపారుల సంఘం కార్యదర్శి, పుంగనూరు
వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి
చింతపండు వ్యాపారులను ప్రభుత్వం తక్షణమే ఆదు కోవాలి. ధరలు లేకపోవడం, చింతపండు నిల్వలు పెరి గిపోయాయి. పుంగనూరులో 15 వేల కుటుంబాలు చింతపండుపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం చింతపండును గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసి, అందరినీ ఆ దుకోవాలి. అలాగే రాయితీలు ప్రకటించాలి. చింతపండు కార్మికులు, రైతులు, వ్యాపారులకు ఆరోగ్యబీమాతో పాటు విరివిగా వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. – ఎంఎస్.సలీంబాషా,
చింతపండు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, పుంగనూరు
Comments
Please login to add a commentAdd a comment