![కృష్ణదేవరాయల విగ్రహంపై వివాదం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07ctr14-300005_mr-1738982511-0.jpg.webp?itok=qR8I8LBC)
కృష్ణదేవరాయల విగ్రహంపై వివాదం
చిత్తూరు అర్బన్: నగరంలోని గంగినేనిచెరువు కట్టపై ఉన్న మున్సిపల్ పార్కులో శ్రీకృష్ణ దేవరాయుల విగ్రహం మూలన పడేయడంపై శుక్రవారం వివాదం నెలకొంది. పార్కులో ఓ మూలన కృష్ణదేవరాయల విగ్రహం పడిపోయి ఉండటాన్ని కొందరు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై కాపు సామాజికవర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై మండి పడుతూ పోస్టులు పెట్టారు. ఉరుకులు పరుగులతో వెళ్లిన అధికారులు పార్కులో చూసేసరికి.. విగ్రహం యథావిధిగా కనిపించింది. దీంతో పార్కు మొత్తం జల్లెడ పట్టగా.. గతేడాది వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రారంభించిన విగ్రహం యథాస్థితిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఓ విగ్రహం మాత్రం చాలా రోజులుగా చెట్ల మధ్య ఉండిపోవడంతో, దాన్ని బయటకు తీసిన కార్పొరేషన్ అధికారులు శుభ్రం చేయించి భద్రపరచినట్లు ప్రకటించారు. దీంతో వివాదానికి తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment