వెట్టి చాకిరీ విముక్తికి సమష్టి కృషి అవసరం
చిత్తూరు అర్బన్: వెట్టి చాకిరీ పనులు చేస్తున్న వారికి విముక్తి కల్పించడానికి సమష్టి కృషి అవసరమని చిత్తూరు తొమ్మిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయ ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవా సదన్ భవనంలో రోప్, ఐజేఎం సంస్థలు, ప్రభుత్వ అధికారులతో కలిసి వెట్టి చాకిరీ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ వెట్టి చాకిరీ వ్యవస్థ సమాజానికి చేటన్నారు. అనంతరం అధికారులతో కలిసి వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, కార్మిక శాఖ అధికారి ఓంకార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, సర్వశిక్షా అభియాన్ పీఓ వెంకటరమణ రోప్స్ సంస్థ చైర్మన్ ధనశేఖరన్, ఐజేఎం నిర్వాహకులు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు టీచర్లకు
చార్జి మెమోలు
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని కట్టమంచి నగరపాలక పాఠశాలలోని ముగ్గురు టీచర్లకు చార్జి మెమోలు శుక్రవారం డీఈఓ వరలక్ష్మి జారీ చేశారు. ఆ పాఠశాలలోని సోషల్ టీచర్ ధనశేఖర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఇటీవల బయటపడిన విషయం విదితమే. ఈ ఘటనలో ఇది వరకే సోషల్ టీచర్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై మరింత లోతుగా విద్యాశాఖ అధికారులు విచారణ జరిపారు. తాజాగా ఆ పాఠశాలలోని పీడీ భువనేశ్వరి, హిందీ టీచర్ జ్యోతిశ్వరి, గణిత టీచర్ మనోహర్‌కు చార్జి మెమోలను డీఈఓ జారీ చేశారు. ఈ చార్జీ మెమోలపై ముగ్గురు టీచర్లు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment