–50 గ్రామల బంగారం స్వాధీనం
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు రైల్వేస్టేషన్‌లో మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ ప్రకా ష్‌ను అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. తిరుపతి రైల్వే డీఎస్పీ హర్షిత, సీఐ యతేంద్రలు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నమన్నారు. అతని వద్ద నుంచి మొత్తం 50 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నమని చెప్పారు. గురువారం సాయంత్రం స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం–2లో తనిఖీ చేస్తుండగా అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తిని ప్రశ్నించామన్నారు. ఆ సమయంలో అతను పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకుని విచారించామన్నారు. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన ప్రకాష్‌పై ఆ రాష్ట్రంలో 11 కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్నట్లు అంగీకరించాడన్నారు. అతని వద్ద నుంచి 14 గ్రామలు చేతిగాజులు, 36 గ్రాముల గల ఒక హనుమాన్ డాలర్, రెండు గొలుసులు సీజ్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. కార్యక్రమంలో జీఆర్‌పీఎఫ్, ఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment