తిరువొత్తియూరు: బైకును లారీ ఢీకొన్న ఘటనలో పుళల్ జైలు కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. చెన్నై సెంట్రల్ పుళల్ జైలులో గోపాలకృష్ణ (24) కానిస్టేబుల్. ఇతను పుళల్ జైలు పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి గోపాలకృష్ణ మరో కానిస్టేబుల్ మణిమారన్ (24) మాధవరం నుంచి పుళల్‌కు బైక్‌లో వెళుతున్నారు. రాత్రి 11 గంటలకు పుళల్ సిగ్నల్ జీఎస్‌టీ రోడ్డు లో వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపాలకృష్ణన్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ మణిమారన్‌ను ఆస్పత్రికి తరలించారు.
రైలు చక్రానికి మనిషి తల: మైసూరు నుంచి చెన్నై సెంట్రల్‌కు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం వచ్చి చేరింది. ఆ సమయంలో రైలు చక్రానికి మనిషి తల చిక్కుకుని ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. తలను చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment