యువతి అదృశ్యంపై కేసు | - | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యంపై కేసు

Published Mon, Nov 18 2024 2:12 AM | Last Updated on Mon, Nov 18 2024 2:12 AM

-

కోటనందూరు: యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తుని మండలం ఎన్‌.వెంకటనగరం గ్రామానికి చెందిన కోరకంటి విమల (22) స్థానిక రెయిన్‌బో ఫ్యాషన్‌ బొటిక్‌ లేడీస్‌ టైలరింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లో శిక్షణ పొందుతుంది. రోజూ మాదిరిగానే శుక్రవారం శిక్షణకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి సింహాచలం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement