ముమ్మిడివరం: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ముమ్మిడివరం నగర పంచాయతీ తిల్లమ్మచెరువుకు చెందిన మెల్లం సాయిబాబు (33) అతని స్నేహితుడికి రూ.15 లక్షలు అప్పు ఇప్పించాడు. ఆ అప్పునకు సంబంధించి సాయిబాబు షూరిటీగా ఉన్నాడు. తీసుకున్న అప్పు చెల్లించాలని సాయిబాబు పదేపదే అడిగినా తనకు సంబంధం లేదని అవతలి వ్యక్తి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురై 14వ తేదీ రాత్రి అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటి వద్ద సాయిబాబు గడ్డి మందు తాగాడు. దీంతో అతనిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment